నాగ్ , వెంకీ..ఇద్దరికీ స్పెషలే

  • IndiaGlitz, [Wednesday,May 11 2016]

ఈ ఏడాది సీనియ‌ర్ టాప్ హీరోలు నాగార్జున‌, వెంక‌టేష్.. ఈ ఇద్ద‌రికీ ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే.. ఈ సంవ‌త్స‌రంతో వీరి కెరీర్ మొద‌లై మూడు ద‌శాబ్దాలు అంటే 30 ఏళ్లు పూర్తి కాబోతోంది మ‌రి. నాగార్జున విష‌యానికి వ‌స్తే.. అత‌ని తొలి చిత్రం 'విక్ర‌మ్' 1986లో మే 23న విడుద‌లై విజ‌యం సాధించింది. వి.మ‌ధుసూద‌న రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో శోభ‌న హీరోయిన్ గా న‌టించింది.

ఇక వెంక‌టేష్ విష‌యానికి వ‌స్తే.. క‌థానాయ‌కుడిగా త‌ను న‌టించిన మొద‌టి సినిమా 'క‌లియుగ పాండ‌వులు' 1986లో ఆగ‌స్టు 14న రిలీజై హిట్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ఖుష్బూ హీరోయిన్ గా న‌టించింది. సో.. మొత్తానికి మూడు ద‌శాబ్దాల కెరీర్ పూర్త‌వుతున్నా ఇప్ప‌టికీ ఈ ఇద్ద‌రు హీరో పాత్ర‌ల‌తోనే కొన‌సాగుతుండ‌డం విశేష‌మే. ఈ ఇద్ద‌రి కెరీర్‌ల‌కి సంబంధించిన 30 ఏళ్ల సంబ‌రాల‌ను త్వ‌ర‌లోనే మ‌నం చూడ‌బోతున్నామ‌న్న‌మాట‌.

More News

పోస్ట్ ప్రొడక్షన్ లో 'ఇది నా లవ్ స్టోరీ'

తరుణ్, ఓవియా జంటగా అభిరామ్ సమర్పణలో రామ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రమేష్, గోపి దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ఇది నా లవ్ స్టోరీ. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

మే 13న నైజాంలో విడుదల కానున్న ఓ మల్లి

బి.రమ్యశ్రీ ప్రధాన పాత్రధారిణిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఓ మల్లి'. ఆర్‌.ఎ.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై బి.ప్రశాంత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 13న నైజాంలో విడుదలవుతుంది.

మొరాకోలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' సందడి

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రధారిగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు.

టాప్ 5 గ్రాస‌ర్ గా స‌రైనోడు చిత్రాన్ని నిల‌బెట్టిన ఫ్యామిలి ఆడియ‌న్స్ మా ప్ర‌త్యేఖ ద‌న్య‌వాదాలు : చిత్ర యూనిట్ స‌భ్యులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ,  ప్రతిష్టాత్మక నిర్మాణ‌సంస్థ‌ గీతా ఆర్ట్స్ కాంబినేష‌న్ లో ఎస్ ప్రోడ్యూస‌ర్‌ అల్లు అరవింద్ నిర్మాణంలో వ‌చ్చిన స‌రైనోడు చిత్రానికి యూత్‌, మాస్ ఆడియ‌న్స్ తో పాటు ప్ర‌త్యేఖంగా ఫ్యామలి ఆడియ‌న్స్ అంద‌రూ అత్య‌ద్బుత‌మైన రెస్పాన్స్ తో క‌లెక్ష‌న్ల‌ రికార్డుల‌Ķ

త్రిష ఇక వాటికే ప‌రిమిత‌మా?

'వ‌ర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా', 'అత‌డు', 'ఆకాశ‌మంత‌'.. ఇలా కొన్ని చిత్రాల్లో ది బెస్ట్ అన‌ద‌గ్గ యాక్టింగ్ స్కిల్స్‌ని ప్ర‌ద‌ర్శించింది త్రిష‌. ఆ త‌రువాత ఆమెకి ఆ రేంజ్ పాత్ర‌లైతే దొర‌క‌లేద‌నే చెప్పాలి.