2016 - వివాదాలు..!
2016 లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఊహించని విజయాలు వచ్చాయి, ఘోరా పరాజయాలు వచ్చాయి. వీటితో పాటు అనుకోని వివాదాలు కూడా ఉన్నాయి. 2016కి గుడ్ బై చెబుతూ...2017కి స్వాగతం చెబుతున్న సందర్భంగా ఎవరు ఎవర్ని ఏమన్నారు..? ఆ వివాదాలు ఏమిటో మీరే చూడండి..!
బన్ని చెప్పను బ్రదర్ వివాదం..!
అల్లు అర్జున్ సరైనోడు సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడుతుంటే...ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పమని అరవడం...బన్ని నేను చెప్పను బ్రదర్ అనడంతో వివాదం మొదలైంది. అక్కడ నుంచి ట్విట్టర్ లో పవన్ ఫ్యాన్స్ బన్నికి వ్యతిరేకంగా చూసుకుంటాం బ్రదర్ అంటూ ట్వీట్స్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఈ వివాదానికి ఫుల్ స్టాఫ్ పెట్టాలని నిర్ణయించుకుని బన్నితో ఒక మనసు ఆడియో ఫంక్షన్ లో మాట్లాడించారని వార్తలు వచ్చాయి. నిహారిక నటించిన ఒక మనసు ఆడియో వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ...వివరణ ఇవ్వడంతో వివాదం ముగిసింది.
వివాదస్పదమైన బాలయ్య మాటలు..!
నారా రోహిత్ నటించిన సావిత్రి ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ ఆడియో వేడుకలో బాలయ్య మాట్లాడుతూ...నేను ఎక్కని ఎత్తులు లేవు. చూడని లోతులు లేవు అన్నారు అంతే కాకుండా ముద్దు అన్నా పెట్టాలి కడుపు అన్నా చేయాలి అన్నారు. బాలయ్య మాట్లాడిన ఈ మాటలు వివాదస్పమయ్యాయి. ఒక ఎమ్మెల్యే అయి కూడా మహిళల గురించి బాలయ్య ఇలా మాట్లాడడం ఏమిటి అంటూ మహిళా సంఘాలు, రాజకీయ నాయకులు ప్రశ్నించడంతో చివరికి బాలయ్య మహిళలకు సారీ చెప్పవలసి వచ్చింది.
ఫ్లాపోత్సవం కాంట్రవర్సీ..!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం బ్రహ్మోత్సవం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అంచనాలను ఏమాత్రం అందుకోలేక ఫ్లాప్ చిత్రంగా నిలిచింది. అయితే...కొంత మంది దురాభిమానులు బ్రహ్మోత్సవం ఫ్లాప్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం...దీనిని ఓ ఆంగ్ల దిన పత్రిక ప్రచురిండంతో మహేష్ ఫ్యాన్స్ కు కోపం వచ్చింది. అంతే ఆ ఆంగ్లదిన పత్రిక పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవ్వడంతో ఆ వార్త ప్రచురించినందుకు చింతిస్తున్నాం అంటూ సారీ చెబుతూ నెక్ట్స్ డే మరో ఆర్టికల్ ప్రచురించడంతో కాంట్రవర్సీ క్లియర్ అయ్యింది.
పవన్ - నాన్నకు ప్రేమతో వివాదం..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో... చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసారు. అయితే... రేపు నాన్నకు ప్రేమతో...సినిమా రిలీజ్ అనగా ఊహించని విధంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి కంప్లైట్ చేయడం విశేషం. ఇంతకీ పవన్ ఎందుకు ఫిర్యాదు చేసారంటే..అత్తారింటికి దారేది సినిమా టైంలో పవన్ కి రెమ్యూనరేషన్ లో భాగంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ రెండు కోట్లు బాకీ ఉన్నారు. నాన్నకు ప్రేమతో...రిలీజ్ టైంలో ఇస్తానని పవన్ కి మాట ఇచ్చారట. అయితే బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ రెండు కోట్లు ఇవ్వకపోవడంతో అసోషియేషన్ లో ఫిర్యాదు చేసారు పవన్. ఫిర్యాదు స్వీకరించిన అసోసియేషన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి ఈ ఫిర్యాదును పంపించింది. ఆతర్వాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ వివాదాన్ని పరిష్కరించుకుని సినిమాని రిలీజ్ చేసారు.
బాలయ్య - చిరు వివాదం..!
ఆంధ్రప్రదేశ్ లో లేపాక్షి ఉత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. హిందూపూర్ లో జరిగిన లేపాక్షి ఉత్సవాలు తెలుగు ఇండస్ట్రీలో వివాదస్పమై హాట్ టాపిక్ గా నిలిచాయి. ఇంతకీ ఏం జరిగింది అంటే...ఈ ఉత్సవాలకు చిరంజీవిని ఆహ్వానించలేదు. ఇదే విషయం పై బాలయ్యను జర్నలిస్టులు ప్రశ్నించగా నేను ఎవర్నీ నెత్తి మీద పెట్టుకోను. నేను ఆహ్వానిస్తే రావడానికి రెడీగా చాలా మంది ఉంటారు కానీ ఎవర్నీ ఆహ్వానించాలో నాకు తెలుసు. నాది డిక్టేటర్ స్టైల్ అనడం హాట్ టాపిక్ గా నిలిచింది.
అల్లు అరవింద్ కాంట్రవర్సీ..!
మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాకి ఎక్కువ ధియేటర్స్ దొరకకుండా అల్లు అరవింద్ అడ్డుపడుతున్నారు అంటూ ప్రచారం జరిగింది. ఎందుకంటే అల్లు అర్జున్ సరైనోడు సినిమాను ఎక్కువ ధియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు అల్లు అరవింద్ ఈవిధంగా బ్రహ్మోత్సవంకు థియేటర్స్ దొరకకుండా ప్రాబ్లమ్ క్రియేట్ చేసారంటూ ప్రచారం జరగడం వివాదస్పమైంది.
త్రివిక్రమ్ అ ఆ వివాదం..!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అ ఆ సినిమా మీనా సినిమా స్పూర్తితో రూపొందింది. అ ఆ రిలీజ్ తర్వాత ఈ సినిమా మీనా సినిమాకి కాపీ అంటూ వార్తలు రావడంతో అ ఆ వివాదస్పమైంది. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ వివరణ ఇస్తూ...మీనా సినిమా యుద్దనపూడి సులోచనా రాణి నవల ఆధారంగా రూపొందింది. ఈ సినిమా టైటిల్స్ లో యుద్దనపూడి సులోచన గార్కి థ్యాంక్స్ చెబుతూ పేరు వేయాలి అనుకున్నాం కానీ టెక్నికల్ ప్రాబ్లమ్ వలన కుదరలేదు. ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్ క్లియర్ చేసి యుద్దనపూడి గారి పేరు వేసాం ఇంకా ఎవరైనా దీనిని వివాదస్పదం చేయాలి అనుకుంటే మీ ఇష్టం. ఈ వివరణతో వివాదం ముగిసింది అనుకుంటున్నాను అని త్రివిక్రమ్ అనడంతో ఈ క్రాంటవర్సీ ఫుల్ స్టాఫ్ పడింది.
రేష్మి - మెగా ఫ్యాన్స్ వివాదం..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ కలెక్షన్స్ విషయమై చరణ్ ఫ్యాన్స్ కి యాంకర్ రేష్మికి మధ్య సోషల్ మీడియాలో వార్ నడిచింది. ఇంతకీ ఏం జరిగింది అంటే...ఎవరో ఓ వ్యక్తి రేష్మి నటించిన గుంటూరు టాకీస్ విజయవాడలో ఫస్ట్ డే 17 లక్షలు వసూలు చేసింది. రామ్ చరణ్ ధృవ విజయవాడలో ఫస్ట్ డే 14 లక్షలు వసూలు చేసింది అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ ను రేష్మి రీట్వీట్ చేస్తూ ఫన్ గా తీసుకున్నాను అంది. రేష్మి రీట్వీట్ పై చరణ్ ఫ్యాన్ ఫైర్ అవుతూ ఎవడో దురాభిమాని ట్వీట్ చేస్తే ఎంజాయ్ చేస్తున్నావా అని రేష్మిని ప్రశ్నించాడు. దీనికి రేష్మి స్పందిస్తూ...ఏది జోక్ గా తీసుకోవాలో నాకు తెలుసు నా ఇష్టం అంటూ కాస్త ఘాటుగానే సమాధానం చెప్పింది. చరణ్ ఫ్యాన్స్ రేష్మి మధ్య వార్ ఇంతటితో ఆగలేదు. నాన్ కమ్మ హీరోలను తక్కువుగా చూస్తున్నావ్ అని చరణ్ ఫ్యాన్ అంటే...కులాల గురించి చిన్నప్పుడు స్కూల్ పుస్తకాల్లో చదువుకున్నాను. కులాల గురించి మాట్లాడుతున్నావ్ మనం ఏ కాలంలో ఉన్నాం. మాకు పని ఉంది బాధ్యత ఉంది దీనిని ఇక్కడితో ఆపితే మంచిది అని చెప్పడం జరిగింది. ఈవిధంగా రేష్మి - మెగా ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ లో జరిగిన వార్ వివాదస్పమైంది..!
పవన్ ఫ్యాన్ వినోద్ రాయల్ హత్య..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ రాయల్ హత్యకు గురవ్వడం వివాదస్పమైంది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ...చంపుకునేంత స్ధాయిలో అభిమానం ఉండకూడదు. నిందుతులను కఠినంగా శిక్షించాలి అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసారు. అయితే...పవన్ ఫ్యాన్ వినోద్ పై దాడి చేసింది ఎన్టీఆర్ ఫ్యాన్ అక్షయ్ అని ప్రచారం జరిగింది. అసలు...చంపుకునేంతగా ఏం జరిగింది అంటే....ఓ సేవా కార్యక్రమానికి వెళ్లిన వీళ్లు మా హీరో గొప్ప అంటే...మా హీరో గొప్ప అంటూ వాదించుకున్నారట. ఆఖరికి పవన్ ఫ్యాన్ ఎన్టీఆర్ కి బ్లాక్ బష్టర్ వచ్చి పదేళ్లు అయ్యింది అనడంతో ఎన్టీఆర్ ఫ్యాన్ కోపం ఆపుకోలేక పవన్ ఫ్యాన్ వినోద్ పై దాడి చేసాడు అంటూ ప్రచారం జరిగింది.
జనతా గ్యారేజ్ - మాటీవీ కాంట్రవర్సీ..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బష్టర్ మూవీ జనతా గ్యారేజ్. ఈ చిత్రం రికార్డ్ స్ధాయిలో దాదాపు 80 కోట్లు వసూలు చేసి ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. అయితే...ఈ సినిమా ఇంకా ధియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగానే ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ మా టీవీ జనతా గ్యారేజ్ చిత్రాన్ని ప్రసారం చేసింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కోపం వచ్చింది. థియేటర్స్ లో జనతా గ్యారేజ్ సినిమా రన్ అవుతున్న టైమ్ లో మా టీవీ ప్రసారం చేయడం కరెక్ట్ కాదు అంటూ మా టీవీ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవ్వడం వివాదస్పమైంది.
నవదీప్ రేవ్ పార్టీ వివాదం..!
నవదీప్ తో పాటు కొంత మంది సినీ నటులు పార్టీ చేసుకోవడం...అది పోలీసులకు తెలియడం..మీడియాలో వార్తలు రావడం వివాదస్పమైంది. ఈ వార్తల పై నవదీప్ స్పందిస్తూ...ఎలాగో వీడి మీద చాలా ఉన్నాయి కదా..! ఇంకొకటి వేసేద్దాం జనాలు నమ్ముతారు...ఆనందిస్తారు. టి.ఆర్ పి వస్తుంది అనుకుంటున్నారు అంటూ నవదీప్ మీడియా పై చేసిన కామెంట్స్ వివాదస్పమయ్యాయి. వాస్తవాలు తెలుసుకుని వార్తలు ప్రసారం చేయండి అంతే కానీ మీ టి.ఆర్.పి రేటింగ్స్ కోసం ఇలా చేయద్దు అంటూ నవదీప్ కామెంట్ చేసారు.
30 ఇయర్స్ పృథ్వీ - బాలయ్య ఫ్యాన్స్ కాంట్రవర్సీ..!
30 ఇయర్స్ పృథ్వీ బాలయ్యలా పేరడీ చేయడం కాంట్రవర్సీ అయ్యింది. బాలయ్య ఫ్యాన్స్ పృధ్వీ చేసే పేరడితో బాగా హర్ట్ అయ్యారు. దీంతో పృధ్వీకి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడంతో బాలయ్య ఫ్యాన్స్ ప్రెసిడెంట్ జగన్ తో మాట్లాడి పృధ్వీ ఇక నుంచి బాలయ్య గురించి పేరడీ చేయను అనడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.
ఎన్టీఆర్ - కోలీవుడ్ డైరెక్టర్ వివాదం
ఎన్టీఆర్ తదుపరి చిత్రాన్ని సింగం 3 ఫేమ్ హరితో చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే...ఇదే విషయాన్ని డైరెక్టర్ హరిని ఓ ఇంటర్ వ్యూలో అడిగితే...ఎన్టీఆర్ ఎవరో నాకు తెలీదు. ఇప్పటి వరకు ఆయన్ని కలవలేదు అని చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఆతర్వాత ఈ వార్తల పై హరిని వివరణ అడిగితే...నేను అలా అనలేదు. అలాంటిది ఎలా ఈ వార్త వచ్చిందో తెలియడం లేదు. ఎన్టీఆర్ అంటే నాకు అభిమానం. టెంపర్ సినిమాని చాలా సార్లు చూసాను. నాకిష్టమైన హీరో గురించి ఇలా ఎలా మాట్లాడతాను అంటూ వివరణ ఇచ్చారు.
పూరి డిస్ట్రిబ్యూటర్స్ కాంట్రవర్సీ..!
పూరి జగన్నాథ్ కి, లోఫర్ చిత్రాన్ని పంపిణి చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కి మధ్య గొడవ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఏం జరిగింది అంటే.. లోఫర్ వలన నష్టం పోయాం అంటూ నష్ట పరిహారంగా కొంత మొత్తాన్ని ఇవ్వాలని పూరి పై డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి తేవడంతో పూరి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆతర్వాత డిస్ట్రిబ్యూటర్స్ పూరి పై డబ్బులు ఇవ్వాలి అంటూ ఒత్తిడి చేయలేదు అనడంతో వివాదం మరింత పెద్దదైంది. ఆఖరికి నిర్మాత సి.కళ్యాణ్ జోక్యంతో ఈ వివాదాం ముగిసింది.
వంగవీటి వివాదం..!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వంగవీటి. ఈ చిత్రంలో వంగవీటి రంగా గురించి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి అంటూ వంగవీటి రాథా ఫిర్యాదు చేయడం జరిగింది. అంతే కాకుండా వర్మకి వంగవీటి రాధా వార్నింగ్ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో వర్మ కూడా ఏమాత్రం తగ్గకుండా.... పని పాట లేకుండా మురికి వీధుల్లో తిరిగే మీ లాంటి వాళ్ళు రాధా రంగాల పేరుని చెడగొట్టటానికే పుట్టారు. మీలాంటి కుయ్యం గాళ్ళు నా దిష్టి బొమ్మల్ని తగలబెట్టచ్చు గాని నేను మీ లోపలి కుళ్ళుని పెట్రోల్ కూడా లేకుండా తగలబెడతా. ఇప్పటికైనా బుద్ధిలేని మీ బుర్రల్లోకి బుద్ది తెచ్చుకోకపోతే నా అంతు చూసే లోపల మీరే అంతమైపోతారు. నేను క్షమాపణలు చెప్పటం అటుంచి మీరు మొరగడం ఆపకపోతే మీ అసలు జాతేంటో అందరికీ తెలిసిపోతుంది...ఖబర్దార్ అంటూ వర్మ వార్నింగ్ ఇచ్చారు.
బాహుబలి 2 విజువల్స్ లీక్..!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం బాహుబలి 2. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే...బాహుబలి 2 సినిమాకి సంబంధించిన 10 నిమిషాల విజువల్స్ లీక్ అయ్యాయి. ఈ ఫుటేజ్ ను టెక్నికల్ టీమ్ లోని వారే లీక్ చేసారని తెలిసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి లీక్ చేసిన వారిని పట్టుకున్నారు.
వి.ఎన్.ఆదిత్య - ఆంగ్లదినపత్రిక వివాదం..!
దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఫ్యామిలీని పట్టించుకోవడం మానేసి విదేశాల్లో ఉంటున్నాడు అంటూ ప్రముఖ ఆంగ్లదిన పత్రిక వార్తను ప్రచురించింది. ఈ వార్త రాసిన జర్నలిస్ట్ పై వి.ఎన్.ఆదిత్య తనైదన శైలిలో ఫైర్ అవ్వడం వివాదస్పమైంది. ఆతర్వాత ఆ జర్నలిస్ట్ పోలీసులను ఆశ్రయించడంతో వివాదం ముగిసింది.
ఖైదీ నెం 150 వివాదం..!
మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150. ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్ తెరకెక్కించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఖైదీ నెం 150 తమిళ చిత్రం కత్తి కి రీమేక్ గా రూపొందిన విషయం తెలిసిందే. అయితే... కత్తి కథ తనదని తనకు న్యాయం చేయాలి అంటూ రచయిత నరసింహరావు రచయితల సంఘంకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో కత్తి తెలుగు రీమేక్ ఖైదీ నెం 150 ప్రారంభోత్సవానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆఖరికి రచయిత నరసింహరావుకు న్యాయం చేసి ఈ వివాదాన్ని పరిష్కరించుకున్నారు. ఆతర్వాతే ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

Comments