2016 బెస్ట్ ఎంటర్ టైనర్స్
2016..నిన్న కాక మొన్న వచ్చినట్టుంది. అప్పుడే కాలం కరిగిపోయింది. సంవత్సరం అయిపోయింది. కొత్త సంవత్సరం 2017 వచ్చేస్తుంది.ఈ సందర్భంగా 2016లో వచ్చిన తెలుగు సినిమాలను ఒక్కసారి పరిశీలిస్తే...వైవిధ్యమైన కథా చిత్రాలు, ప్రయోగాత్మక చిత్రాలు, చిన్న చిత్రాలుగా రూపొంది పెద్ద విజయాన్ని సాధించిన చిత్రాలు...ఇలా అన్నిరకాల చిత్రాలు మరచిపోలేని అనుభూతిని అందించాయి. వీటితో పాటు అంచనాలను అందుకోలేక ఘోరంగా ఫెయిలైన భారీ చిత్రాలు ఉన్నాయి. కంటెంట్ ఉంటే చాలు...చిన్న హీరో సినిమా అయినా సరే... ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమా చూస్తారు అని మరోసారి నిరూపించిన చిత్రాలు వచ్చాయి. టోటల్ గా 2016 తెలుగు సినీ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించింది. అయితే...ఈ సంవత్సరంలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని బెస్ట్ ఎంటర్ టైనర్స్ గా నిలిచిన చిత్రాల గురించి క్లుప్తంగా మీకోసం..!
నేను శైలజ
ఈ సంవత్సరం వచ్చిన చిత్రాల్లో ముందుగా చెప్పుకోవలసింది నేను శైలజ. రామ్ - కీర్తి సురేష్ జంటగా కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెకండ్ హ్యాండ్ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన నేను శైలజ చిత్రం ప్యూర్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం ద్వారా మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ తెలుగు తెరకు పరిచయమైంది. రామ్, కీర్తి సురేష్ ల నటన, దేవిశ్రీ మ్యూజిక్, సత్యరాజ్ పర్ ఫార్మాన్స్...ఇలా అన్నిఅంశాలు ఆడియోన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. రామ్ కెరీర్ కి అవసరమైన మంచి హిట్ ను ఇచ్చి 2016లో తొలి విజయాన్ని అందించింది నేను శైలజ.
కిల్లింగ్ వీరప్పన్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం కిల్లింగ్ వీరప్పన్. గంథపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. శివరాజ్ కుమార్ పోలీసాఫీసర్ గా నటించగా, సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్ర పోషించారు. వీరప్పన్ లైఫ్ స్టోరీ పై వర్మ సినిమా అనగానే సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా కథకు కరెక్ట్ గా సరిపోయే నటీనటులను ఎంచుకోవడం, పాత్రకు తగ్గట్టు వాళ్లు నటించడం దీనికి తోడు వర్మ టేకింగ్ అదరగొట్టడంతో సినిమా సక్సెస్ అయ్యింది. అయితే... మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాని ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండేది అనిపించింది. ఏది ఏమైనా ఇటీవల కాలంలో వర్మ నుంచి వచ్చిన బెస్ట్ మూవీగా వీరప్పన్ ఆకట్టుకుంది.
నాన్నకు ప్రేమతో...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం నాన్నకు ప్రేమతో.. ఎన్టీఆర్ 25వ చిత్రం కావడంతో నాన్నకు ప్రేమతో పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా నాన్నకు ప్రేమతో...రిలీజైంది. కథ విషయానికి వస్తే...తండ్రి కోరిక నెరవేర్చడం కోసం కొడుకు ఏం చేసాడనే విభిన్న కథా చిత్రమిది. సుకుమార్ తనదైన శైలిలో ఇంట్రస్టింగ్ & ఇంటిలిజెన్స్ స్ర్కీన్ ప్లేతో తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెప్పించింది. ఎన్టీఆర్ గెటప్ & పర్ ఫార్మెన్స్, రకుల్ గ్లామర్, దేవిశ్రీ మ్యూజిక్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ ల పర్ ఫార్మెన్స్...టోటల్ గా నాన్నకు ప్రేమతో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా 50 కోట్లు షేర్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో 50 కోట్లు షేర్ సాధించిన తొలి చిత్రంగా నాన్నకు ప్రేమతో సరికొత్త రికార్డ్ సాధించింది.
సోగ్గాడే చిన్ని నాయనా
కింగ్ నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరో, హీరోయిన్లుగా రూపొందిన సంచలన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున ఈస్ట్ గోదావరి స్లాంగ్ లో మాట్లాడడం.. దీనికి తోడు చాలా గ్యాప్ తర్వాత నాగార్జున, రమ్యకృష్ణ కలిసి నటించడం ఆడియోన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. అలాగే చాలా రోజుల తర్వాత పల్లెటూరి నేపధ్యంతో మూవీ రావడంతో సంక్రాంతి పండగకి కరెక్ట్ మూవీ ఇదే అని ఫీలై ప్రేక్షకులు బ్రహ్మారధం పట్టారు. మూడు సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ సోగ్గాడు రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ సాధించడం విశేషం. 53 కోట్లకు పైగా షేర్ సాధించి 50 కోట్ల క్లబ్ లో చేరిన ఏకైక సీనియర్ హీరోగా నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో చరిత్ర సృష్టించారు.
ఎక్స్ ప్రెస్ రాజా
రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సూపర్ హిట్స్ తరువాత యంగ్ ఎనర్జిటిక్ స్టార్ శర్వానంద్, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బంపర్ హిట్ తరువాత మేర్లపాక గాంధీ కలయికలో రూపొందిన చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా. శర్వనంద్ సరసన సురభి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. సరికొత్త స్ర్కీన్ ప్లే, దీనికి తోడు డిఫరెంట్ క్యారెక్టర్స్ తో కథను గాంధీ నడిపించిన విధానం బాగుంది.సంక్రాంతి పోటీలో భారీ చిత్రాల మధ్య రిలీజైన ఈ చిన్న సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఆదరణ పొందింది. ఈ కామెడీ ఎక్స్ ప్రెస్ విజయం సాధించి శర్వనంద్ కెరీర్ లో హ్యాట్రిక్ ని అందించింది.
కృష్ణ గాడి వీర ప్రేమ గాథ
నేచేరల్ స్టార్ నాని, మెహ్రీన్ జంటగా నటించిన చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ. ఈ చిత్రాన్ని అందాల రాక్షసి ఫేమ్ హను రాఘవపూడి తెరకెక్కించారు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. విభిన్న ప్రేమకథ కావడం...దీనికి తోడు ఎంటర్ టైన్మెంట్ & ఇంట్రస్టింగ్ ట్విస్ట్ లు ఉండడంతో ఆడియోన్స్ ను ఆకట్టుకుంది. భలే భలే మగాడివోయ్ తర్వాత నాని సినిమా అంటే సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండడంతో విజయం సాధించి నాని ఇమేజ్ ను మరింత పెంచింది కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రం.
క్షణం
చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం సాధించిన చిత్రం క్షణం. అడవి శేష్, ఆదాశర్మ, అనసూయ, రాజేష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ప్రయోగాత్మక చిత్రాన్ని నూతన దర్శకుడు రవికాంత్ పేరేపు తెరకెక్కించారు. భారీ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా ఈ చిత్రాన్ని నిర్మించింది. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ తో ఈ చిత్రాన్ని నడిపించిన విధానం బాగుండడం, ఒక కొత్త రకమైన సినిమా కావడంతో ఆడియోన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అడవి శేష్, ఆదాశర్మ, అనసూయ, సత్యం రాజేష్, సత్యదేవ్ లకు సక్సెస్ అందించింది ఈ సినిమా. అడవి శేష్ హీరోగా నటించడంతో పాటు ఈ మూవీకి కథను కూడా అందించి... రైటర్ గాను, హీరోగాను ఓకే సినిమాతో సక్సెస్ సాధించాడు. కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా ఆడియోన్స్ ఆదరిస్తారు అని నిరూపించింది క్షణం.
ఊపిరి
టాలీవుడ్ కింగ్, కోలీవుడ్ హీరో కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఊపిరి. ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. భారీ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఫ్రెంచ్ లో క్లాసిక్ అనిపించుకున్న ఇన్ టచ్ బుల్స్ మూవీ ఆధారంగా ఊపిరి చిత్రాన్ని రూపొందించారు. ప్రయోగాల సర్ధార్ కింగ్ నాగార్జున నుంచి వచ్చిన మరో విభిన్న కథా చిత్రమిది. నాగార్జున వీల్ ఛైర్ కే పరిమితమైన క్యారెక్టర్ అంటే సినిమా ఎలా ఉంటుందో అనుకున్నారు. కానీ...అందరి అంచనాలను తారుమారు చేస్తూ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. తెలుగు, తమిళ్ లో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఊపిరి చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ వసూలు చేసింది. రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా రూపొందిన ఊపిరి తెలుగు సినిమాకి కొత్త ఊపిరి ఇచ్చింది.
సుప్రీమ్
మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా పటాస్ ఫేమ్ అనిల్ రవిపూడి కాంబినేషన్లో రూపొందిన కమర్షియల్ ఎంటర్ టైనర్ సుప్రీమ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయిధరమ్ తేజ్ సరసన రాశీఖన్నా నటించింది. బెల్లం శ్రీదేవి పాత్రలో రాశీఖన్నా పోలీస్ క్యారెక్టర్ లో నవ్వించింది. ఇక సాయిధరమ్ తేజ్ అయితే తనదైన శైలిలో నటించి మాస్ ని మెప్పించాడు. కమర్షియల్ మూవీ అంటే ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అవన్నీ మిక్స్ చేసి అనిల్ రవిపూడి అందించిన ఎంటర్ టైనర్ ఇది. పటాస్ లో పృధ్వీరాజ్, ప్రభాస్ శీను లా ఇందులో పోసాని, శ్రీనివాసరెడ్డి చేసిన కామెడీ బాగా నవ్వించింది. దీనికి తోడు సాంగ్స్, ఫైట్స్ మాస్ ని బాగా మెప్పించాయి. టోటల్ గా అనిల్ రవిపూడి పటాస్ తర్వాత సుప్రీమ్ తో వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
సరైనోడు
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సరైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు. కమర్షియల్ సినిమా అంటే ఎలా ఉండాలో బోయపాటికి బాగా తెలుసు. అందుకనే మాస్ ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించి అల్లు అర్జున్ ని పూర్తి స్ధాయి మాస్ హీరో చేసాడు బోయపాటి.ఈ సినిమా ద్వారా బోయపాటి ఆది పినిశెట్టిని విలన్ గా పరిచయం చేసారు. బన్ని, ఆది పినిశెట్టి నటన ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. ఈ మూవీకి ముందుగా డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఊహించని విధంగా రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ వసూలు చేసి సరైనోడు బ్లాక్ బష్టర్ గా నిలవడం విశేషం.
అ ఆ
నితిన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం అ ఆ. అనుబంధం, ఆత్మీయత, ప్రేమ తదితర అంశాలతో త్రివిక్రమ్ రూపొందించిన అందమైన ప్రేమకథగా అ ఆ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నితిన్ సరసన సమంత, అనుపమ పరమేశ్వరన్ నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం ఆకట్టుకుంది. ఈ చిత్రం అన్ సీజన్ లో రిలీజైన అంచనాలకు మించి రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ సాధించింది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో రికార్డ్ స్ధాయిలో $ 2.45 మిలియన్ డాలర్స్ వసూలు చేసి నితిన్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది.
జెంటిల్ మన్
నేచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కించిన చిత్రం జెంటిల్ మన్. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఓ కొత్తరకమైన సస్పెన్స్ థ్రిల్లర్ ని ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రేక్షకులకు అందించారు. ఈ చిత్రం ద్వారా మలయాళ బ్యూటీ నివేథా థామస్ ని హీరోయిన్ గా పరిచయం చేసారు. తొలి చిత్రంతోనే నివేథా ఆకట్టుకుని టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది. అష్టాచమ్మా కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం బిగినింగ్ నుంచి ఆడియోన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. దీనికి తోడు డిపరెంట్ స్టోరీ కావడం, ఇంటర్వెల్ లో సస్పెన్స్, క్లైమాక్స్ లో రివీల్ చేసిన ట్విస్ట్ బాగా కనెక్ట్ కావడంతో ప్రేక్షకాదరణ పొంది జెంటిల్ మన్ నాని కెరీర్ లో మరో హిట్ మూవీగా నిలిచింది.
పెళ్లి చూపులు
చిన్న చిత్రంగా రిలీజై పెద్ద విజయాన్నిసొంతం చేసుకున్న సంచలన చిత్రం పెళ్లి చూపులు. విజయ్ దేవరకొండ, రీతు వర్మ జంటగా నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సురేష్ బాబు సమర్పణలో రాజ్ కందుకూరి ఈ చిత్రాన్నినిర్మించారు. ఎంత పెద్ద సినిమా అయినా రెండు మూడు వారాలు మాత్రమే ఆడుతున్న ఈరోజుల్లో ఓ చిన్న చిత్రం సక్సెస్ ఫుల్ గా 100 రోజులు ఆడడం అంటే ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పెళ్లిచూపులు చిత్రం ఓవర్ సీస్ లో సైతం రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ వసూలు చేయడం విశేషం. రెగ్యులర్ చిత్రాలా కాకుండా ఈ మూవీని తెరకెక్కించిన విధానమే కొత్తగా ఉండడంతో ఇండస్ట్రీ ప్రముఖులను సైతం మెప్పించింది పెళ్లి చూపులు.
జనతా గ్యారేజ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన జనతా గ్యారేజ్ ఊహించని విధంగా అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. పర్యావరణాన్ని కాపాడాలనే ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండడం...మోహన్ లాల్, ఎన్టీఆర్ ల నటన, దేవిశ్రీ సంగీతం, కొరటాల టేకింగ్...ఇలా అన్ని కలిసి జనతా గ్యారేజ్ కి సంచలన విజయాన్ని అందించాయి. దాదాపు 80 కోట్లు షేర్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా జనతా గ్యారేజ్ సంచలనం సృష్టించింది.
జ్యో అచ్యుతానంద
నారా రోహిత్ - నాగశౌర్య, రెజీనా కాంబినేషన్లో అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం జ్యో అచ్యుతానంద. ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మించారు. అన్నదమ్ములైన ఈ ఇద్దరు తమ ఇంట్లో అద్దెకు ఉండే అమ్మాయితో ప్రేమలో పడడం...ఆ అమ్మాయి నో చెప్పడం మామూలే. అయితే...పెళ్లైనప్పటికీ ప్రేమలో పడడం...ఆతర్వాత వీరి లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. సింపుల్ స్టోరీని ఇంట్రస్టింగ్ స్ర్కీన్ ప్లేతో తెరకెక్కించడంలో అవసరాల సక్సెస్ అయ్యాడు. టైటిల్ దగ్గర నుంచి వెరైటీగా అనిపించిన జ్యో అచ్యుతానంద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.
ప్రేమమ్
అక్కినేని నాగ చైతన్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ప్రేమమ్. మలయాళంలో సంచలన విజయం సాధించిన ప్రేమమ్ చిత్రం తెలుగులో ఎలా ఉంటుందో అనుకున్నప్పటికీ యూత్ కి బాగా కనెక్ట్ కావడంతో సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా నాగ చైతన్య మూడు డిఫరెంట్ రోల్స్ లో అద్భుతంగా నటించి నటుడుగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. చైతన్య సరసన శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సబాస్టియన్ నటించారు. సన్నివేశానికి తగ్గట్టు సంభాషణలు, మాస్ కి, యూత్ కి నచ్చే సీన్స్ తో ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కించడంలో చందు మొండేటి సక్సెస్ అయ్యాడు. ప్రేమమ్ దాదాపు 25 కోట్లు షేర్ సాధించి నాగ చైతన్య కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది.
ఎక్కడికి పోతావు చిన్నవాడా
స్వామిరారా, కార్తికేయ, సూర్య వెర్సెస్ సూర్య...ఇలా వైవిధ్యమైన కథాంశాలతో విజయం సాధించి యూత్‌లో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న హీరో నిఖిల్. టైగర్ ఫేం వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్, హెబ్బాపటేల్ జంటగా రూపొందిన చిత్రం ఎక్కడికిపోతావు చిన్నవాడా. రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నోట్ల రద్దు ప్రభావం ఉన్నప్పటికీ రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ రాబట్టి నిఖిల్ కెరీర్ లో హయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండాఫ్ టేకింగ్, నిఖిల్, నందిత శ్వేతాల నటన, వెన్నెల కిషోర్, సత్యల కామెడీ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. మొత్తానికి ఊహించని విధంగా ఎక్కడికి పోతావు చిన్నవాడా సక్సెస్ సాధించింది.
జయమ్ము నిశ్చయమ్మురా
కమెడియన్ టర్నడ్ హీరో శ్రీనివాసరెడ్డి నటించిన తాజా చిత్రం జయమ్ము నిశ్చయమ్మురా. ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి, పూర్ణ జంటగా నటించారు. శివరాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై శివరాజ్ కనుమూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సమైక్యంగా నవ్వుకుందాం అనే ట్యాగ్ లైన్, దేశవాళి ఎంటర్ టైన్మెంట్ అనే నినాదంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జయమ్ము నిశ్చయమ్మురా చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్ ఫుల్ మూవీ అనిపించుకుంది. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా నూతన దర్శకుడు శివరాజ్ కనుమూరి చేసిన ప్రయత్నానికి ఇండస్ట్రీ ప్రముఖుల ప్రశంసలతో పాటు సినీ విమర్శకుల ప్రశంలు లభించాయి.
ధృవ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రూపొందిన స్టైలీష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ధృవ. ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళ్ లో ఘన విజయం సాధించిన తని ఓరువన్ మూవీకి రీమేక్ గా రూపొందిన ధృవ చిత్రం ఆడియోన్స్ ను ఆకట్టుకోవడం సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా రామ్ చరణ్ గెటప్ & యాక్షన్, అరవింద్ స్వామి స్టైలీష్ విలనిజం, సురేందర్ రెడ్డి టేకింగ్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవర్ సీస్ లో 1 మిలియన్ మార్క్ ను అందుకుని చరణ్ కెరీర్ లో1 మిలియన్ మార్క్ సాధించిన తొలి చిత్రంగా ధృవ రికార్డ్ క్రియేట్ చేసింది.

2016.. నిన్న కాక మొన్న వచ్చినట్టుంది. అప్పుడే కాలం కరిగిపోయింది. సంవత్సరం అయిపోయింది. కొత్త సంవత్సరం 2017 వచ్చేస్తుంది. ఈ సందర్భంగా 2016లో వచ్చిన తెలుగు సినిమాలను ఒక్కసారి పరిశీలిస్తే... వైవిధ్యమైన కథా చిత్రాలు, ప్రయోగాత్మక చిత్రాలు, చిన్న చిత్రాలుగా రూపొంది పెద్ద విజయాన్ని సాధించిన చిత్రాలు... ఇలా అన్నిరకాల చిత్రాలు మరచిపోలేని అనుభూతి