2014 లో రానున్న'కొరియర్ భాయ్ కల్యాణ్'
Send us your feedback to audioarticles@vaarta.com
పోటాన్ కథాస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా' కొరియర్ భాయ్ కల్యాణ్'. నితిన్, యామీ గౌతమ్ జంటగా నటిస్తున్నారు. గౌతమ్ మీనన్ నిర్మాత. కార్తీక్, అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. ప్రేమ్ సాయి దర్శకుడు. ఈ సంవత్సరమే విడుదల కావాల్సిన ఈ సినిమా తాజా సమాచారం ప్రకారం వచ్చే సంవత్సరానికి పోస్ట్ పోన్ అయ్యింది.
దీనికంటే ముందుగా నితిన్, పూరి జగన్నాథ్ ల 'హర్ట్ ఎటాక్ 'విడుదలకు సిద్ధమవుతుందట. 'కొరియర్ భాయ్ కల్యాణ్' ద్విభాషా చిత్రం. తమిళంలో కొంత పోఫన్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదట. అందుకే ఈ సినిమా వచ్చే సంవత్సరానికి పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం. నితిన్, పూరీల 'హర్ట్ ఎటాక్' మాత్రం వచ్చేసంక్రాంతి బరిలోకి దిగడానికి శరవేగంగా షూటంగ్ జరుపుకుంటుంది.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments