మౌనిక ఫ్యామిలీకి రూ. 20 లక్షలు.. ఒకరికి ఉద్యోగం!
- IndiaGlitz, [Monday,September 23 2019]
హైదరాబాద్‌లో మెట్రో పిల్లర్ పెచ్చులూడిపడి మౌనిక అనే మహిళ చనిపోయిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో మెట్రోలో ప్రయాణించాలన్నా.. మెట్రోకు దరిదాపుల్లోకి వెళ్లాలన్నా హైదరాబాదీలు జంకుతున్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటనపై ఎల్అండ్టీ అధికారులు మౌనిక కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరిగాయి. అయితే ఈ క్రమంలో తమకు 50 లక్షల రూపాయిలు చెల్లించాల్సిందేనని మౌనిక కుటుంబం డిమాండ్ చేయగా.. ఫైనల్‌గా రూ. 20లక్షలు ఇచ్చేందుకు అధికారులు ముందుకొచ్చారు.
అంతేకాదు.. మౌనిక కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వాధికారులు హామీ ఇచ్చారు. అధికారులు ఇచ్చిన ఈ హామీకి బాధిత కుటుంబం అంగీకరించినట్లు సమాచారం. ఈ ఘటనలో హైదరాబాద్ మెట్రో పిల్లర నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ అండ్ టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మొత్తానికి చూస్తే.. ఈ ఘటనను ఇంతటితో అధికారులు సింపుల్‌గానే మేనేజ్ చేసేశారన్న మాట. మరి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మెట్రో అధికారులు ఎలా చూసుకుంటారో వేచి చూడాలి మరి.