'భలే భలే మగాడివోయ్ ' కి రెండేళ్లు
Send us your feedback to audioarticles@vaarta.com
మతిమరుపు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే.. ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. మతిమరుపు స్థాయి ఎక్కువై.. చేయాల్సిన పనిని మరిచిపోయి మరొక పనిలో బిజీగా అయిపోతుంటారు కొందరు. అలాంటి కొందరిలో లక్కీ ఒకడు. ఆ లక్కీ చుట్టూ తిరిగే కథే 'భలే భలే మగాడివోయ్'.
లక్కీ మతిమరుపు, దాని వల్ల అతను ఎదుర్కొనే కష్టాలు, అతని ప్రేమకథ.. ఈ అంశాల చుట్టూ వినోదాత్మకంగా అల్లుకున్న ఈ సినిమాలో లక్కీగా నాని నటన సహజంగా ఉంటుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి మారుతి దర్శకుడు. గోపీసుందర్ సంగీతం అలరించేలా ఉంటుంది. సెప్టెంబర్ 4, 2015న విడుదలైన 'భలే భలే మగాడివోయ్' నేటితో రెండేళ్లను పూర్తిచేసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com