కోల్‌కత్తాలో '2 స్టేట్స్' సెకండ్ షెడ్యూల్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
లక్ష్య ప్రొడక్షన్స్ , ప్రొడక్షన్స్ no.1 గా రూపొందిస్తున్న చిత్రం '2 స్టేట్స్' (వర్కింగ్ టైటిల్ ). చేతన్ భగత్ రాసిన నవల '2 స్టేట్స్' ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అడవిశేష్, శివానీ రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకట్ కుంచం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎంఎల్‌వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మాత. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ కోల్‌కత్తాలో ఏకధాటిగా 15 రోజులు జరిగింది.
ఈ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా ... నిర్మాత ఎంఎల్‌వి సత్యనారాయణ(సత్తిబాబు) మాట్లాడుతూ - "ఏప్రిల్ నుండి '2 స్టేట్స్' చిత్రీకరణను అనుకున్న ప్లానింగ్‌లో చక్కగా చేస్తున్నాం. హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఇటీవల కోల్‌కత్తాలో సెకండ్ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. శేష్, శివాని, భాగ్యశ్రీ, రజిత్ కపూర్, లిజి, ఆదిత్య మీనన్ కాంబినేషన్లో కీలకమైన టాకీ సన్నివేశాలను చిత్రీకరించాం. రషెస్ చూశాం.
సినిమా చాలా బాగా వస్తోంది. ఈ నెల 7 నుంచి మూడో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తాం. డైరెక్టర్ వెంకట్ గారు సినిమాను ఆద్యంతం చక్కగా తెరకెక్కిస్తున్నారు. బ్యూటీఫుల్, క్యూట్ రొమాంటిక్ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అడివిశేష్, శివాని పెయిర్ కనువిందు చేస్తుంది" అన్నారు.
దర్శకుడు వెంకట్ రెడ్డి కుంచం మాట్లాడుతూ - "ఫస్ట్ షెడ్యూల్ అనుకున్న ప్లానింగ్‌లో పూర్తయ్యింది. కోల్‌కత్తాలో సెకండ్ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. 15 రోజుల పాటు నిర్విరామంగా కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. '2 స్టేట్స్' నవల చదువుతున్నంతసేపు పాఠకుడు ఎంతగా ఆస్వాదిస్తాడో, మా సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు రెట్టింపుగా ఆస్వాదిస్తాడనే నమ్మకం ఉంది" అన్నారు.
అడివిశేష్, శివానీ రాజశేఖర్, రజత్ కపూర్, భాగ్యశ్రీ, ప్రియా చౌదరి, లిజి, ఆదిత్య మీనన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, విద్యుల్లేఖా రామన్, హేమ, ఉత్తేజ్ తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రపీ: షానియల్ డియో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.కుమార్, నిర్మాత: ఎం.ఎల్.వి.సత్యనారాయణ (సత్తిబాబు), దర్శకత్వం: వెంకట్ రెడ్డి కుంచం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments