'2.0' మళ్లీ వాయిదా?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్, డైరక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సైంటిఫికల్ థ్రిల్లర్ '2.0'. 450 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేద్దామని అనుకున్నారు..కానీ తాజా సమాచారం ప్రకారం సినిమా ఇప్పుడు ఏప్రిల్ 13కు వాయిదా పడింది. విఎఫ్ఎక్స్ వర్క్స్ పూర్తి కావడానికి ఇంకా వ్యవథి పట్టేలా ఉండటంతో యూనిట్ సినిమాను ఏప్రిల్‌కు విడుదల చేయాలనుకుంటున్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.
2.0 వాయిదా పడటం ఇది రెండోసారి. దీంతో రజనీకాంత్ అభిమానులకు మరోసారి నిరాశ తప్పట్టే లేదు. అయితే దీనిపై యూనిట్ నుండిఎటువంటి అధికారక సమాచారం లేదు. ఈ చిత్రం ఆడియో ఈ నెల 27న దుబాయ్..బూర్జ్ ఖలీఫా భవంతిలో జరిగింది. అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎమీజాక్సన్ నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com