నవంబర్ 29న గ్రాండ్ రిలీజ్ అవుతున్న విజువల్ వండర్ '2.0'
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘2.0’. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది.ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దడానికి 2150 వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ ఉపయోగించారు.
3000 మంది వి.ఎఫ్.ఎక్స్ టెక్నీషియన్స్.. 1000 టిపికల్ వి.ఎఫ్.ఎక్స్ షాట్ మేకర్స్ ఈ సినిమా కోసం పనిచేశారు. ఆదివారం ఈ సినిమా మేకింగ్ వీడియోస్, పాట, ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. పూర్తిస్థాయి త్రీ డీ టెక్నాలజీతో.. 4డీ సౌండింగ్‌తో తెరకెక్కిన తొలి ఇండియన్ సినిమా `2.0`. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను ఎన్.వి.ఆర్. సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. `2.0` పాటలు, ట్రైలర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. సోషల్ మీడియాలో 2.0 ట్రైలర్, పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
ఈ సందర్భంగా... సూపర్‌స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ - ``విజువల్ వండర్‌గా రూపొందిన `2.0` చిత్రం ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 29న విడుదల కానుంది. ఈ డైరెక్టర్ శంకర్‌గారు సినిమాను అద్భుతమైన మెసేజ్‌తో ప్రతి సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా మలిచారు. ఈ సినిమాతో ఇండియన్ సినిమా ఇంటర్నేషనల్ స్థాయికి చేరుతుంది. ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చిందంటే అందుకు ముఖ్య కారణం శంకర్ అయితే.. ఆయన కంటే ముందు అభినందిచాల్సి వ్యక్తి నిర్మాత సుభాష్ కరణ్. ఆయనకు సినిమాపై ఉన్న ప్యాషన్ కారణంగానే ఈ సినిమాను ఇంత గొప్పగా చేయగలిగాం. ఎంతో మంది టెక్నీషియన్స్ రాత్రింబగళ్లు ఎంతో కష్టపడ్డారు. సినిమా కోసం నేను కూడా అందరితో పాటు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను`` అన్నారు.
గ్రేట్ డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ - ``సూపర్‌స్టార్ రజనీకాంత్ గారితో నేను చేస్తున్న మూడో సినిమా `2.0`. పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైన్‌మెంట్. సినిమా అనేదాన్ని కూడా దాటి... త్రీడీ టేకింగ్, 4డీ సౌండింగ్ అనే కొత్త అనుభవాన్ని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. రెహమాన్‌గారు, రసూల్ పూకుట్టి కొత్త సౌండింగ్ టెక్నాలజీని ఈ చిత్రంతో పరిచయం చేస్తున్నారు. ఇలాంటి గొప్ప సినిమాను మనం చేయగలం అని నిరూపించాం. నిర్మాత సుభాష్ కరణ్ సుభాష్ కరణ్ లేకపోతే ఈ సినిమా లేదు. ఇండియన్ సినిమాను ఇంత బడ్జెట్ తో ఎవరూ నిర్మించరు. ఆయన అందించిన ప్రోత్సాహంతో పాటు సూపర్‌స్టార్ రజనీకాంత్ అందించిన తోడ్పాటుతో గొప్ప అనుభూతిని ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం`` అన్నారు.
ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ - ``2.0కి సంగీతం చేయడం చాలా గొప్ప అనుభం. ఎనిమిది సినిమాలకు పనిచేసినంత అనుభం వచ్చింది. 4డీ అనే సౌండింగ్ టెక్నాలజీని పరిచయం చేస్తున్నాం. రీరికార్డింగ్ కోసం చాలా కష్టపడ్డాం. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది టెక్నీషియన్స్ అహర్నిశలు కష్టపడ్డారు. సరికొత్త అనుభవాన్ని ప్రేక్షకులు ఈ నవంబర్ 29న ఫీల్ అవుతారు`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com