అంచనాలను పెంచుతున్న '2.0'
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్, ఎమీజాక్సన్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న విజువల్ వండర్ `2.0`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ అసోసియేషన్‌తో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. గాంధీ జయంతి సందర్భంగా దర్శకుడు శంకర్ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియో చూస్తే.. అంచనాలు ఆకాశాన్నంటేలా ఉన్నాయి. ఇండియాలోనే హాయ్యస్ట్ బడ్జెట్ మూవీ .. అంతే కాకుండా ఏషియాలోనే రెండో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. అలాగే త్రీడీ కెమెరాస్‌లో చిత్రీకరించిన తొలి ఇండియన్ చిత్రం కూడా ఇదే.
త్వరలోనే ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. రీసెంట్‌గా విడుదలైన టీజర్ డిజిటల్ మీడియాలో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో 2150 వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ ఉపయోగిస్తున్నారు. 3000 మంది టెక్నీషియన్స్ సినిమా కోసం పనిచేస్తున్నారు. 1000 టిపికల్ వి.ఎఫ్.ఎక్స్ షాట్ మేకర్స్ సన్నివేశాలను అద్భుతాలుగా చూపడానికి కృషి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో త్రీడీ, టూడీ వెర్షన్స్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments