'2.0' ప్రమోషన్స్ స్టార్ట్...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న సైంటిఫికల్ విజువల్ వండర్ `2.0`. 2010లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన మూవీ `రోబో` సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్నాడు. ఎమీ జాక్సన్ నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.
వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేస్తున్నారు. సినిమా విడుదలకు ఎనిమిది నెలలు సమయం ఉండగానే సినిమా యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసింది. ప్రమోషన్స్‌తో సినిమాను హాలీవుడ్ రేంజ్‌కు తీసుకెళ్ళడానికి లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజమహాలింగం ఆలోచిస్తున్నారు. మా సినిమాను హాలీవుడ్ సినిమాగా భావిస్తున్నాం కాబట్టే ప్రమోషన్స్ కూడా అదే రేంజ్లో ప్లాన్ చేస్తున్నామని, అందుకే వంద అడుగుల ఎత్తుతో బెలూన్ను తయారు చేసి విదేశాల్లో బెలూన్ సందడి చేయనుంది. దుబాయ్‌లో ఆడియో వేడుకను పాతిక కోట్ల ఖర్చుతో నిర్వహించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com