2.0 నిర్మాత‌ల కేసు..

  • IndiaGlitz, [Saturday,December 09 2017]

దాదాపు 450 కోట్ల బ‌డ్డెట్‌తో రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ '2.0'. ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, ఎమీజాక్స‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. ప్ర‌స్తుతం ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తున్నారు నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది దీపావ‌ళికి విడుద‌ల చేస్తామ‌నుకున్నారు కానీ..కుద‌ర‌క‌పోవ‌డంతో 2018 జ‌న‌వ‌రి 25న విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నారు.

కానీ వి.ఎఫ్‌.ఎక్స్ ప‌నుల జాప్యం కార‌ణంగా సినిమా ఆల‌స్య‌మ‌య్యేలా ఉండ‌టంతో సినిమాను ఏప్రిల్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ సినిమా ఏప్రిల్‌లో విడుద‌లైతే చాలా సినిమాపై ఈ ప్ర‌భావం ప‌డుతుంది కాబ‌ట్టి..చాలా మంది నిర్మాతలు ఈ సినిమా ఏప్రిల్ విడుద‌ల‌ను వ్య‌తిరేకిస్తున్నారు.

ఇది లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాత‌ల‌కు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. అయితే ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికీ కార‌ణం అమెరికాకు చెందిన ఓ వి.ఎఫ్‌.ఎక్స్ సంస్థే. అందువ‌ల్ల నిర్మాత‌లు స‌దరు సంస్థ‌పై కేసు వేశార‌ట‌. కానీ ఏం చేస్తాం. జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయిన‌ట్లేగా.