భారీ విరాళం ప్రకటించిన నిర్మాత
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడు తీర ప్రాంతాలోని ప్రజలు గజ తుపాను కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆస్థి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పుడు వీరిని అదుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం సహా కోలీవుడ్ పరిశ్రమ ముందుకు వచ్చింది. అందరూ విరాళాలు ప్రకటిస్తున్నారు.
రజనీకాంత్ 50 లక్షలు.. సూర్య, కార్తి, జ్యోతిక, శివకుమార్ కలిసి 50 లక్షలు, విజయ్ సేతుపతి 25 లక్షలు, డైరెక్టర్ శంకర్ 10 లక్షల రూపాయలను విరాళాలుగా ప్రకటించారు. కాగా ఇప్పుడు '2.0' చిత్ర నిర్మాత సుభాష్ కరణ్ అందరి కంటే ఎక్కువగా కోటి లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ విరాళాన్ని సీఎం సహాయనిధికి ఇవ్వబోతున్నట్లు నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments