'2.0' ... ఓవర్ సీస్‌లో 1.5 మిలియన్ మార్క్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన భారీ విజువల్ వండర్ '2.0'. 3డి, 2డి ఫార్మాట్‌లో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నవంబర్ 29న గ్రాండ్‌గా విడుదలైంది. తెలుగులో ఈ చిత్రాన్ని ఎన్.వి.ఆర్. సినిమా సంస్థ విడుదల చేసింది. భారీ ఓపెనింగ్స్‌తో సూపర్ డూపర్ హిట్ టాక్ సాధించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ.110 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.21.5 కోట్లు కలెక్ట్ చేసింది. తాజాగా ఓవర్‌సీస్‌లో తొలిరోజున ప్రీమియర్స్‌తో కలుపుకుని తెలుగు, తమిళం, హిందీ లాంగ్వేజెస్‌లో 9,83,305 డాలర్స్‌ను వసూలు చేసింది. కాగా.. రెండో రోజున 4338888 డాలర్స్‌ను వసూలు చేసి 1.5 మిలియన్‌కు రీచ్ అవుతుంది. ఈ వారాంతరానికి 2.5 మిలియన్ డాలర్స్‌ను వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అంటే మన కరెన్సీ ప్రకారం 15-16 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధిస్తుందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Liya Harini
Contact at support@indiaglitz.com