'2.0' కు హిందీలో కూడా నష్టమేనా..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ '2.0' .. నవంబర్ 29న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్‌కు భారీ నష్టాలను మిగుల్చేలా ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.
హిందీ వెర్షన్లో ఇప్పటికే 102 కోట్ల రూపాయలను వసూలు చేసినప్పటికీ.. కరణ్ జోహార్‌కు ఇది నష్టాలను మిగిల్చే ప్రాజెక్ట్ అవుతుంని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం కరణ్ జోహార్ 80 కోట్ల రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించారట. ఇప్పుడు బ్రేక్ ఈవెన్‌కి మరో 100 కోట్లు కావాలి.
అయితే కలెక్షన్స్ పరంగా సినిమా 102 కోట్లనే వసూలు చేసిందట. రెండో వారంలో '2.0' 80 కోట్లను కలెక్ట్ చేస్తుందా అనే సందేహంగా మారింది. ఎక్కువగా 30 కోట్ల రూపాయలు వసూలు చేస్తాయేమో.. ఆ రకంగా 2.0 కరణ్జోహార్కు నష్టాలనే మిగిల్చేలా ఉందని ఫిలింనగర్ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments