'2.0' ను లీక్ చేసిన త‌మిళ్ రాక‌ర్స్‌

  • IndiaGlitz, [Thursday,November 29 2018]

ఇండియ‌న్ సినిమాల్లోనే భారీ బ‌డ్జెట్ చిత్రంగా 550 కోట్ల రూపాయ‌ల‌తో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ '2.0'. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్, అక్ష‌య్‌కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం నేడు విడుద‌లైంది.

అయితే ఈ సినిమా విడుద‌లైన కొన్ని గంట‌ల‌కే పైర‌సీ వెర్ష‌న్‌ను రిలీజ్ చేస్తామ‌ని త‌మిళ్ రాక‌ర్స్ వెబ్‌సైట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అన్న‌ట్లుగా 2.0 విడుద‌లైన కొన్ని గంట‌ల్లో హెచ్‌.డి ప్రింట్‌ను రాక‌ర్స్ లీక్ చేసి యూనిట్‌కు షాకిచ్చింది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సూట్ ఫైల్ చేయ‌డంతో 37 ఇంటర్నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్‌, 2000 వెబ్ పోర్ట‌ల్స్‌ను బ్లాక్ చేసింది లైకా టీమ్‌.