'2.0' ఇండియన్ సినిమా - డైరెక్టర్ శంకర్

  • IndiaGlitz, [Saturday,October 28 2017]

న‌ల‌భై ఏళ్ల న‌ట జీవితం నాలుగైదేళ్లుగా గ‌డిచిపోయింది. దేవుడి ఆశీర్వాదం, ప్రేక్ష‌కుల అభిమానంతోనే ఇది సాధ్య‌మైందని ర‌జ‌నీకాంత్ అన్నారు. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో 450 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న సైంటిఫిక‌ల్ విజువ‌ల్ వండ‌ర్ '2.0'. ఈ చిత్రం నిన్న దుబాయ్ బూర్జ్ ఖలీఫాలో ఆడియో వేడుక‌ను జరుపుకుంది.

2.0లో త‌మిళ సినిమా కాదు, ఇండియ‌న్ సినిమా. నాకు భాషా బేదాలు లేవు. చికుబుకు రైలే పాట‌తో రెహ‌మాన్‌తో నా ప్ర‌యాణం ప్రారంభ‌మైంది. మా జ‌ర్నీ 23 ఏళ్లుగా కొన‌సాగుతుంది. రోబోలో ఇనుములో హృద‌యం మొలిచెనె పాట‌కు రెహ‌మాన్ చాలా క‌ష్ట‌ప‌డి ట్యూన్ అందించారు. 2.0లో కూడా రెండు మిష‌న్ల‌కు మ‌ధ్య ల‌వ్‌సాంగ్‌కు ఇంకా క‌ష్ట‌ప‌డి ట్యూన్ ఇచ్చారని డైరెక్ట‌ర్ శంక‌ర్ తెలిపారు. 2.0 భార‌తీయులు గ‌ర్వించ‌ద‌గ్గ సినిమా అని రెహ‌మాన్ తెలిపారు.

ఈవేడుక‌కు ర‌జ‌నీకాంత్ కుటుంబ స‌భ్యులు, సూర్య‌, జ్యోతిక త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

More News

జై సింహ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణతన 102 వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి జై సింహా అనే టైటిల్ ఖరారు చేశారని ఆ మధ్య వార్తలు వినిపించాయి.

2018కి పవన్.. 2019కి చిరు

2018 సంక్రాంతికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రంతో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పవన్ కి నటుడిగా 25వ చిత్రం కావడం విశేషం.

'పి ఎస్ వి గరుడ వేగ 126.18 ఎం' ఇంటరాక్షన్

డా.రాజశేఖర్. ఈయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం 'పిఎస్ వి గరుడవేగ 126.18ఎం'. పూజాకుమార్, శ్రద్ధాదాస్, కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఉషా మయూరి ద్వారా 'జూన్ 1:43' చిత్రం విడుదల

ఆదిత్య‌, రిచా హీరో హీరోయిన్లుగా ఆదిత్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై భాస్క‌ర్ బంటుప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్ష్మి నిర్మిస్తున్న చిత్రం 'జూన్ 1:43'. శ్రవణ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా పాటలకు మంచి ఆదరణ లబిస్తోంది. ఇక నవంబర్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మేము పక్కా లోకల్ పోస్టర్ లాంచ్..

విక్రమ్ ఆర్ట్స్ సమర్పించు విఖ్యాత హరితవనం" మేము పక్కా లోకల్" దద్దరిల్లే జానపదం అనే క్యాప్షన్ తో 45 మంది బుల్లితెర  కళాకారులతో మొట్ట మొదటిసారిగా జానపద ఆట పాటల కార్యక్రమాన్ని జి.శ్రీనివాస్ రెడ్డి నిర్మాతగా విక్రమ్ ఆదిత్య రెడ్డి నిర్మాణంలో ఏర్పాటు చేస్తున్నారు.