తెలుగు రాష్ట్రాల్లో 2.0 క‌లెక్ష‌న్స్ డ్రాప్

  • IndiaGlitz, [Saturday,December 01 2018]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ '2.0'. న‌వంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు త‌మిళ, హిందీ భాష‌ల్లో గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం తొలిరోజునే 110 కోట్ల రూపాయ‌లు క‌లెక్ట్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున 21.5 కోట్ల రూపాయలు వ‌సూలు చేసింది. అయితే రెండో రోజు వ‌చ్చేస‌రికి ఈ క‌లెక్ష‌న్స్ దారుణంగా డ్రాప్ అయ్యాయ‌ని ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం.

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 6 కోట్ల రూపాయ‌ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను మాత్ర‌మే సాధించింది. అది కూడా వీకెండ్ శనివారం అయ్యి ఉండి కూడా క‌లెక్ష‌న్స్ డ్రాప్ కావ‌డం డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌ను కాస్త క‌ల‌వ‌రపెడుతుంద‌ట‌. మ‌రి వ‌ర‌ల్డ్ వైడ్ ఎంత వ‌సూళ్లు వ‌చ్చాయో అధికారికంగా నిర్మాత‌లు ఎంత ప్ర‌క‌టిస్తారో చూడాలి.