'2.0' కలెక్షన్స్...డ్రాప్ అవుతున్నాయా..
- IndiaGlitz, [Wednesday,December 05 2018]
సూపర్‌స్టార్ రజనీకాంత్, అక్షయ్‌కుమార్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న విజువల్ వండర్ '2.0'. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10500 స్క్రీన్స్‌లో భారీగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ విషయాన్ని చూస్తే యూనిట్ సభ్యులు సినిమా మెగా బ్లాక్‌బస్టర్ 400 కోట్ల రూపాయలు వసూళ్లు వచ్చాయంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ లెక్కలు వేరుగానే ఉన్నాయని సినీ వర్గాలు అంటున్నాయి.
1. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 54.5 కోట్ల రూపాయలు గ్రాస్ ... 36 కోట్ల రూపాయలు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. కాగా.. ఈ సినిమా కోసం తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ 72 కోట్ల రూపాయలు వెచ్చించారు
2. ఇక తమిళనాడు విషయానికి వస్తే 61.4 కోట్లు గ్రాస్ అయితే.. 35.1 షేర్ కలెక్షన్స్ వచ్చాయి. థియేట్రికల్ రైట్స్‌ను డిస్ట్రిబ్యూటర్స్ 100 కోట్ల రూపాలయతో దక్కించుకున్నారు.
3.కేరళ విషయానికి వస్తే 12.4 కోట్లు గ్రాస్.. 5.7 కోట్ల రూపాయలు షేర్ కలెక్షన్స్ రాగా.. 16 కోట్ల రూపాయలకు థియేట్రికల్ హక్కులు దక్కించుకున్నారు.
4. కర్ణాటక విషయానికి వస్తే 23.1 కోట్ల రూపాయల గ్రాస్.. 11.3 కోట్ల రూపాయలు షేర్ కలెక్షన్స్ రాగా.. థియేట్రికల్ హక్కులను 30 కోట్ల రూపాయలకు దక్కించుకున్నారు.
5. రెస్టాఫ్ ఇండియాలో 115.6 కోట్ల రూపాయలు వసూళ్లు రాగా.. 52.8 కోట్ల రూపాయలు షేర్ కలెక్షన్స్ వచ్చాయి.
6. ఇక ఓవర్‌సీస్ విషయానికి వస్తే గురు, శుక్ర, శని, ఆది వారాల్లో దాదాపు 3.5 మిలియన్ డాలర్స్‌ను వసూలు చేసిన ఈ చిత్రం సోమ, మంగళ వారాల్లో పూర్ కలెక్షన్స్‌ను రాబట్టకుంది. రెండు లక్షల పైచిలుకు డాలర్స్ వసూళ్లను మాత్రమే దక్కించుకుంది. మొత్తంగా చూస్తే నాలుగు మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి.
ఇండియా వైడ్ చూస్తే థియేట్రికల్ రైట్స్ కోసం 295కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 145కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఓవర్ సీస్‌లో 7-9 మిలియన్ డారల్స్ వస్తేనే ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ అయినట్లు కానీ ఇప్పటి వరరకు వచ్చింది 4 మిలియన్స్ మాత్రమే. ఓవరాల్‌గా చూస్తే ఈ సినిమా కలెక్షన్స్ సోమ, మంగళవారం రోజుల్లో దారుణంగా పడిపోయింది.