రాజధాని భూ కుంభకోణం వ్యవహారంలో కీలక వ్యక్తుల అరెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
అమరావతి రాజధాని భూ కుంభకోణం విషయంలో ఇద్దరు కీలకు వ్యక్తులను బుధవారం సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన గుమ్మడి సురేష్ అనే వ్యక్తితో పాటు తుళ్లూరు రిటైర్డ్ తహసిల్దార్ సుధీర్‌బాబులను సీఐడీ అరెస్ట్ చేసింది. భూ రికార్డుల తారుమారు వ్యవహారంలో సుధీర్ బాబు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. టీడీపీ నేతలతో చేతులు కలిపి సుధీర్ బాబు రికార్డులను తారుమారు చేసినట్టు తెలుస్తోంది. కాగా ఆయనకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నట్టు తెలుస్తోంది.
గుమ్మడి సురేష్ విషయానికి వస్తే దళితులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసినట్టు తేలడంతో ఆయనను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే సీఆర్డీఏ నెక్కల్లు డిప్యూటీ కలెక్టర్ కనికెళ్ల మాధురిని అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో తప్పుడు రికార్డులు, అక్రమాలకు పాల్పడిన వ్యవహారంపై అరెస్ట్ చేశారు. కాగా అగ్రిగోల్డ్ స్కామ్, రాజధాని భూముల స్కామ్‌ల విషయంలో మరో ఇద్దరు మాజీ మంత్రుల అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments