చంద్రబాబుకు ఊహించని షాక్.. ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్!
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఊహించని షాక్ తగలనుంది. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి టాటా చెప్పడానికి సిద్ధమైపోయారు. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఒంగోలు వెళ్లిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు.. బాలినేనితో భేటీ అయ్యారు. ఈ మేరకు పార్టీలో చేరికపై నిశితంగా చర్చించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరికాసేపట్లో లేదా ఇవాళ సాయంత్రం లోపు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. సీఎం ప్రస్తుతం ‘మన పాలన- మీ సూచన’ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్‌ను కలవనున్నారు.
చేరిక ఎందుకు..!?
ఇప్పటికే.. ఇందుకు సంబంధించి అన్ని చర్చలు అయిపోయాయని.. కొద్దిసేపట్లో మంత్రి బాలినేనితో కలిసి నేరుగా తాడేపల్లికి ఆ ఇద్దరు నేతలు వెళ్లనున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె నుంచి పోటీ చేసిన అనగాని సత్యప్రసాద్.. వైసీపీ అభ్యర్థిపై గెలుపు సాధించి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఏలూరి సాంబశివరావు.. ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి.. దగ్గుబాటి వెంకటేశ్వర్రావుపై విజయం సాధించారు. వాస్తవానికి వీరిద్దరూ ఫలితాలు వచ్చిన నాటి నుంచే వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నప్పటికీ పరిస్థితులు చక్కబడతాయ్.. తామున్న సొంతపార్టీకి మంచి రోజులొస్తాయని భావించారు. కానీ రోజురోజుకు రాష్ట్రంలో పరిణామాలు మారిపోతుండటం.. జగన్ చేపట్టే అభివృద్ధి పనులను చూసిన ఆ ఇద్దరు వైసీపీలోకి జంప్ అవుతున్నారు. కాగా అనగాని ఇదివరకే బీజేపీలో చేరడానికి ఢిల్లీ వేదికగా చర్చలు కూడా జరిపారని అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాదు.. ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడే జేపీ నడ్డాతో కూడా సమావేశం అయ్యారు. అయితే.. అది జరగలేదు. తాజాగా నిర్ణయం మార్చుకున్న అనగాని, ఏలూరితో సహా వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
మరుసటి రోజే షాక్..
వాస్తవానికి నెల రోజులుగా సోషల్ మీడియాలో టీడీపీ చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఆ పార్టీకి టాటా చెప్పబోతున్నారని.. వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వారిలో అనగాని, ఏలూరి కూడా ఉన్నారు. అయితే.. చంద్రబాబు ఏపీకి వచ్చిన తర్వాతే తెలుగుదేశంకు షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. అందుకే సుమారు రెండునెలలకు పైగా హైదరాబాద్‌లో గడిపి ఏపీలో అడుగుపెట్టిన మరుసటి రోజే బాబుకు ఇలాంటి షాక్ ఇస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే చంద్రబాబుకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఊహించని షాక్ ఇవ్వబోతున్నారన్న మాట. అంతేకాదు.. వీరి తర్వాత ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారని తెలియవచ్చింది. దీనిపై ఆ టీడీపీ ఎమ్మెల్యేలు.. జంప్ అయ్యే ఎమ్మెల్యేలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments