ప్రేమమ్ థియేట్రికల్..2 మిలియన్ వ్యూస్..!
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెరకెక్కించిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్రేమమ్. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ప్రేమమ్ థియేట్రికల్ ట్రైలర్ కు అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఈనెల 20న రిలీజ్ చేసిన ప్రేమమ్ ట్రైలర్ కు తక్కువ టైమ్ లోనే 2 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.
ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందిస్తూ...ధియేట్రికల్ ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాం. తక్కువ టైమ్ లోనే మా ట్రైలర్ కు 2 మిలియన్ వ్యూస్ రావడంతో ప్రేమమ్ పై మరింత నమ్మకం పెరిగింది. అందరి అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుంది. మరచిపోలేని ప్రేమకథా చిత్రాన్ని చూడడానికి రెడీగా ఉండడండి అని తెలిపారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 7న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments