ప్రియమణి పుట్టినరోజు.. రెండు లుక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ ప్రియమణి ఇప్పుడు మళ్లీ బిజీగా మారుతుంది. పెళ్లికి ముందు కన్నడ చిత్రసీమకు మాత్రమే పరిమితమైన ప్రియమణి కొంతకాలం ముందు జబర్దస్త్ ప్రోగామ్కు జడ్జ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తెలుగులో బిజీగా మారుతుంది. తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. ఈ రెండు చిత్రాలు ప్రియమణికి చాలా మంచి పేరుని తెచ్చే చిత్రాలే కావడం విశేషం. అందులో ఒకటి విరాటపర్వం. రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రియమణి నక్సలైట్ పాత్రలో నటిస్తుంది. ఈమె పాత్ర గురించి వినిపిస్తోన్న వార్తలపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో భారతక్క అనే నక్సలైట్ పాత్రలో ప్రియమణి నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
మరో చిత్రం నారప్ప. తమిళ చిత్రం అసురన్‌కు ఇది తెలుగు రీమేక్. ఇందులో వెంకటేశ్ సరసన ప్రియమణి నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన లుక్‌ను కూడా ప్రియమణి పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. వెంకటేశ్ భార్య పాత్రలో ప్రియమణి నటిస్తోంది. తమిళంలో మంజు భార్గవి చేసిన పాత్రను తెలుగులో ప్రియమణి చేసింది.
ఇలా పుట్టినరోజు సందర్భంగా ప్రియమణి నటిస్తోన్న రెండు సినిమాలకు ఫస్ట్‌లుక్స్ విడుదలై అభిమానులకు ఆనందాన్ని పంచాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments