రామ్ ఇద్దరమ్మాయిలతో...
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ స్టార్ రామ్ రీసెంటుగా ఉన్నది ఒకటే జిందగీ` మూవీతో పలకరించాడు. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా రామ్ తో తెరను పంచుకున్నారు. ఈ చిత్రం.. బిలో ఏవరేజ్ సినిమాగా రామ్ కెరీర్లో నిలిచిపోయింది.
ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో రామ్ అప్ కమింగ్ మూవీ తెరకెక్కనుంది. నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన నేను లోకల్` సినిమాతో హిట్ కొట్టిన త్రినాథరావు నక్కిన ఈ మూవీకి డైరెక్టర్. సినిమా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలతో రామ్ ఆడిపాడనున్నాడని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని తపనతో ఉన్న రామ్, రామ్ కి ఎలాగైనా సక్సెస్ అందించాలని అనుకుంటున్న దిల్ రాజు లకి ఈ ఇద్దరు హీరోయిన్స్ కాన్సెప్ట్ ఎంతవరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన రామ రామ కృష్ణ కృష్ణ` సినిమా కూడా ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సబ్జెక్ట్‌నే. అయితే.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం సాధించలేదు.
రామ్ కెరీర్లో వచ్చిన సూపర్ హిట్స్ దేవదాసు`, రెడీ`, కందిరీగ`, నేను శైలజ`.. ఇలా అన్ని కూడా సింగల్ హీరోయిన్ సినిమాలే కావడం విశేషం. మరి ఇప్పుడు ఇద్దరమ్మాయిల కాన్సెప్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments