'2 ఫ్రెండ్స్ చిత్రం' ప్రారంభం

  • IndiaGlitz, [Friday,June 09 2017]

ముళ్ళ‌గూరు ల‌క్ష్మీ దేవి స‌మ‌ర్ప‌ణ‌లో అనంత లక్ష్మి క్రియేషన్స్ బ్యానర్‌పై ముళ్ళ‌గూరు అనంత రాముడు, మ‌ళ్ళ‌గూరు ర‌మేష్ నాయుడు నిర్మిస్తున్న కొత్త చిత్రం '2 ఫ్రెండ్స్' 'ట్రూ ల‌వ్ స్టోరీ' అనేది ఉప శీర్షిక‌శుక్ర‌వారం హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభ‌మైంది. సూరజ్, రవీంద్ర తేజ, సోనియా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి జి.ఎల్‌.బి.శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తొలి స‌న్నివేశానికి ఎమ్మెల్యే గాంధీ క్లాప్ నివ్వ‌గా , విజ‌య్ చంద‌ర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఓం సాయిప్ర‌కాష్ ముహుర్త‌పు స‌న్నివేశానికి గౌర‌వ దర్శ‌క‌త్వం వ‌హించారు. అనంత‌రం

నిర్మాత ముళ్ళ‌గూరు అనంత రాముడు మాట్లాడుతూ - ''నేను రైతుగా జాతీయ‌, అంత‌ర్జాతీయ అవార్డుల‌ను అందుకున్నాను. ఇంజ‌నీరింగ్ కాలేజీల‌ను స్థాపించి విద్య‌ను అందిస్తున్నాను. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన అన్ని ప‌నులు విజ‌య‌వంతమ‌య్యాయి. తొలిసారి సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టాను. ఇక్క‌డ కూడా విజ‌యం సాదిస్తాన‌నే ధీమా ఉంది. ఘ‌టికాచ‌లంగారు మంచి క‌థ‌ను అందించారు. ప్రేమ క‌న్నా స్నేహం గొప్ప‌ద‌ని చెప్పే సినిమా ఇది. ఆనంద స‌మ‌యంలో అంద‌రూ వెంట ఉంటారు. కానీ క‌ష్ట‌కాలం ఎదుర‌య్యే స‌రికి బంధువులు కూడా ద‌గ్గ‌ర‌కు రారు. అలాంటి స‌యంలో స్నేహితుడు ఒక్క‌డే క‌ష్టం వెనుక ఉంటాడు. ఆ పాయింట్ ను హైటైట్ చేస్తూ సినిమా తెర‌కెక్కిస్తున్నాం. త‌ప్ప‌కుండా మంచి విజ‌యం సాధిస్తున్న న‌మ్మ‌కంది ఉంది. అలాగే ఈ ఫీల్డ్ లో కూడా నా మార్క్ నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేస్తాను' అని అన్నారు.

ర‌చయిత పోలూర్ ఘ‌టికాచ‌లం మాట్లాడుతూ - ''నిర్మాత ముళ్ళ‌గూరు అనంత రాముడుగారు అనంత‌పురం జిల్లాకు చెందిన పెద్ద రైతు. ఉత్త‌మ రైతుగా రాష్ట్రప‌తి అవార్డు కూడా గెలుచుకున్నారు. అనంత ల‌క్ష్మి ఇంజ‌నీరింగ్ కాలేజీల‌ను స్థాపించి ఎంతో మంది విద్యార్థుల‌కు విద్య‌ను అందిస్తున్నారు. ఆయ‌న సినిమా రంగంలోకి రావాల‌నుకోవ‌డం, ఆ స‌మ‌యంలో నేను చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నారు. మంచి క‌థ‌, క‌థ విన్న‌వారంద‌రూ చాలా బావుంద‌ని అప్రిసియేట్ చేశారు. ల‌వ్ స‌బ్జెక్ట్‌. ప్రేమ కంటే స్నేహం గొప్ప‌ద‌ని చాటే చిత్రం'' అని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు జి.ఎల్‌.బి.శ్రీనివాస్ మాట్లాడుతూ - ''మంచి క‌థ‌ను త‌యారు చేసుకోవ‌డానికి ఏడాది స‌మ‌యం ప‌ట్టింది. సాంగ్స్ అన్ని రికార్డింగ్ పూర్త‌య్యాయి. నిర్మాత‌గారు క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌ద్ద‌ని మంచి సిన‌మా చేయాల‌ని అంటున్నారు. యూత్‌కు సంబంధించిన మంచి క‌థ‌. అంద‌రికీ న‌చ్చే చిత్రంగా తెర‌కెక్కిస్తాం'' అన్నారు.

హ‌రో సూర‌జ్ మాట్లాడుతూ, ' క‌న్న‌డ భాష‌లో మూడు సినిమాలు చేశాను. తెలుగులో నాకిది డెబ్యూ మూవీ. మంచి క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. ల‌వ్..ఫ్రెడ్స్ షిప్ ను ఆధారంగా చేసుకుని రాసుకున్న క‌థ ఇది. ఆరెండింటి మధ్య వ్య‌త్యాసాన్ని సినిమాలో చూపిస్తున్నాం. సినిమాను అంద‌రూ ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా' అని అన్నారు.

సినిమాలో అవ‌కాశం ప‌ట్ట హీరోయిన్లు హీరోయిన్ సోనియా ఆనందం వ్య‌క్తం చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో ఓం సాయిప్ర‌కాష్‌, విజ‌య్ చంద‌ర్‌, ధ‌న‌రాజ్ పాల్గొన్నారు.

సూర‌జ్‌, ర‌వీంద్ర తేజ‌, కోట‌శ్రీనివాస‌రావు, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, సాయిప్ర‌కాష్‌, విజ‌య్ చంద‌ర్‌, ధ‌న‌రాజ్‌, కృష్ణ చైత‌న్య త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి పాట‌లుః చిర్రావూరి విజ‌య్‌కుమార్‌, వ‌రికుప్ప‌ల యాద‌గిరి, డి.వై.ర‌ఘురాం, కొరియోగ్ర‌ఫీః స్వ‌ర్ణ‌బాబు, ఎడిటింగ్ః మార్తాండ్ కె.వెంక‌టేష్‌, క‌థ‌, మాట‌లు, సంగీతంః పోలూర్ ఘ‌టికాచ‌లం, సినిమాటోగ్ర‌ఫీః టి.సురేంద‌ర్ రెడ్డి, నిర్మాత‌లుః ముళ్ళ‌గూరు అనంత రాముడు, ముళ్ళ‌గూరు ర‌మేష్ నాయుడు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః జి.ఎల్‌.బి.శ్రీనివాస్‌.