2-డీజీ ఔషధం ధర ఫిక్స్..

  • IndiaGlitz, [Friday,May 28 2021]

2-డీజీ ఔషధాన్ని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌తో కలిసి డీఆర్‌డీవో ఆధ్వర్యంలోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌’ (ఇన్‌మాస్‌) అభివృద్ధి చేసింది. అయితే ఈ ఔషధం కొవిడ్ రాకుండా నియంత్రించడానికైతే ఉపయోగపడదు. కొవిడ్ చికిత్సకు మాత్రమే పని చేస్తుంది. ఆక్సిజన్‌ అవసరమైన కొవిడ్‌ బాధితులు త్వరగా కోలుకునేలా ఈ ఔషధం పనిచేస్తున్నట్లు డీఆర్‌డీఓ ప్రకటించింది. నీటిలో కలుపుకొని తాగేలా పౌడర్‌ రూపంలో ఉన్న ఈ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) ఇటీవల అత్యవసర వినియోగ అనుమతిని ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ నెల 17న తొలి విడత కింద 10వేల సాచెట్లను, మే 27న రెండో విడత కింద మరో 10వేల సాచెట్లను రెడ్డీస్‌ ల్యాబ్స్‌ మార్కెట్లోకి విడుదల చేసింది.

ఇదీ చదవండి: ఆనందయ్య మందుపై సీసీఆర్‌ఏఎస్‌‌కు నివేదిక..

కరోనా కట్టడి కోసం ఏడాది పాటు శ్రమించి డీఆర్‌డీవో ఈ ఔషధాన్ని తీసుకొచ్చింది. కరోనా రోగుల ఆక్సిజన్ లెవల్ తగ్గిపోవడంతోపాటు వారి పరిస్థితి అంతకంతకూ దారుణంగా మారుతున్న తరుణంలో రోగులకు యాంటీ కొవిడ్ డ్రగ్ అయిన 2-డీజీ బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ డ్రగ్ ప్రత్యేకత ఏంటంటే.. ఏదైనా వైరస్ శరీరంలో మిగతా కణాలను ఇన్ఫెక్ట్ చేస్తున్నప్పుడు, ఈ మందు అది తెలుసుకుని ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే ఆ వైరస్‌ లోపలికే వెళ్తుంది తద్వారా వైరస్ ప్రభావాన్ని తగ్గించేస్తుంది. మన శరీరంలోకి గ్లూకోజ్ ఎలా వెళ్తుందో ఈ మందు కూడా అలాగే పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్‌కు గురైన కణాల్లోకి చేరి వాటి శక్తిని తగ్గిస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్ వ్యాపించడాన్ని అరికడుతుంది. తద్వారా రోగి కోలుకునేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

ఎవరికి వినియోగిస్తారు?

అయితే ఈ డ్రగ్ కరోనా బారిన పడిన రోగులకు మాత్రమే ఉపయోగపడుతుంది. కరోనా రాకుండా నివారించడానికి ఉపయోగపడదు. దీనిని ఆస్పత్రిలో ఒక మోస్తరు నుంచి తీవ్ర పరిస్థితుల్లో ఉన్న కరోనా రోగులపై మాత్రమే ఉపయోగించాలి. ఆక్సిజన్ సపోర్ట్‌ లేదా ఐసీయూలో ఉన్న రోగులకు ఇది ఒక దివ్యౌషధం. ట్రయల్స్ సమయంలో అలాంటి రోగులపై ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ డ్రగ్ గ్లూకోజ్ అనలాగ్. జనరిక్ మాలిక్యూల్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి దీనిని త్వరగా తయారు చేసే వీలుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ డ్రగ్ పౌడర్‌ రూపంలో దొరుకుతుంది. దానిని గ్లూకోజ్‌లాగే నీళ్లలో కలిపి ఉపయోగించవచ్చు.

More News

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి ప్రధాని మోదీ ప్రశంసలు..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి దిగ్విజయంగా నిర్వహిస్తున్న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. పచ్చదనం పెంపు అవసరాన్ని,

ఆనందయ్య మందుపై సీసీఆర్‌ఏఎస్‌‌కు నివేదిక..

కరోనా నివారణకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య మందుపై ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఆయుష్ తన విచారణను పూర్తి చేసి పాజిటివ్ నివేదికనే ఇచ్చింది.

దేశంలో 44 రోజుల కనిష్టానికి కరోనా కేసులు

దేశంలో భయాందోళనలు కలిగిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. వైరస్ కట్టడికి రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయి.

బీజేపీలోకి ఈటల.. ముహూర్తం ఫిక్స్!

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి రంగం కూడా సిద్ధమైనట్టు సమాచారం. దీనికి ముహూర్తం కూడా ఖరారైనట్టు తెలుస్తోంది.

రాజమౌళి తండ్రి ఫోన్ లో పూరి ఫోటో.. షాకింగ్ రీజన్, నీ రేంజ్ ఇది అంటూ కొరటాల..

టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు ప్రత్యేక స్థానం ఉంది. పూరి శైలిని ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు. పూరి ఇండస్ట్రీలో నిర్మాతల దర్శకుడు అనే మంచి పేరు ఉంది.