ముద్దు సీన్ కోసం రెండు రోజుల ట్రైనింగ్.. రికార్డ్ బ్రేక్ చేసిన హీరోహీరోయిన్లు
Send us your feedback to audioarticles@vaarta.com
లిప్ లాక్ సీన్లకు సినీ పరిశ్రమలో భలే డిమాండ్ ఉంటుంది. ఒకప్పుడు ఈ సీన్ అంటే ఆచితూచి స్పందించేవారు. కానీ ఇమ్రాన్ హస్మి లాంటి హీరోల రాకతో.. ఆ సీన్లు చాలా కామన్ అయిపోయాయి. తాజాగా ఓ సినిమాలో ముద్దు సీన్.. గత రికార్డులను తిరగరాస్తోంది. నిమిషం నిడివితో ముద్దు సీన్ తీసినట్లు చెబుతున్నారు. బాలీవుడ్ మూవీ ‘మలంగ్’ సినిమాలో ఈ సీన్ ఉంది. హీరో ఆదిత్య రాయ్ కపూర్, హీరోయిన్ దిశా పటానిలతో తీసిన ఈ సీన్ కోసం.. రెండు రోజులు కష్టపడ్డారట. ప్రత్యేకంగా ట్రెయినింగ్ ఇచ్చారట. ఎందుకంత కష్టం అనుకుంటున్నారా? ఈ సీన్ నీళ్లలో ఉండటమే. నీళ్ల అడుగున హీరోహీరోయిన్లు అదర చుంబనం చేయడంతో.. ఆ సీన్‌కు అంత కష్టపడాల్సి వచ్చిందట. నీళ్లలో ఊపిరితీసుకోవడం కష్టం కాబట్టి.. ఆ ఇబ్బందులు ఏవీ తలెత్తకుండా దర్శకుడు ఈ జాగ్రత్తలు తీసుకున్నారట. ట్రైనర్ పర్యవేక్షణలో ఈ సీన్ తీశారు. విశేషం ఏంటంటే.. ఫస్ట్ టేక్‌లోనే ఓకే అనిపించుకున్నారిద్దరూ.
నిర్మాణంలో ఉండగానే ఇంత హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సీన్.. విడుదలయ్యాక ఎంతగా పేలతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తుండగా, లవ్ రంజన్, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, అంకుర్ గార్గ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినీ జనాలను ఆకట్టుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com