నాని చేతుల మీదుగా సునీల్ 'టూ కంట్రీస్' ఆడియో విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
మహాలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై దర్శకుడు ఎన్ శంకర్ స్వీయ దర్శక నిర్మాణం లో సునీల్ హీరో గా తెరకెక్కుతున్న చిత్రం 'టూ కంట్రీస్'. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో బహు సందడిగా జరిగింది. హీరో నాని ఆడియో సీడీలను విడుదల చేసి తొలి సీడీని ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ కు అందచేశారు.
అనంతరం నాని మాట్లాడుతూ... సునీల్ అన్నతో హీరో కాక ముందు నుండి మంచి పరిచయం ఉంది. `ఢీ` సినిమాకు నన్ను అసిస్టెంట్ డైరెక్టర్‌గా రెకమండ్ చేసింది సునీల్ అన్నే. నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యే సమయానికి తను మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకునేశారు. కానీ నాతో ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. నాలో కాన్ఫిడెంట్‌ను పెంచిన వ్యక్తి. ఇక 2 కంట్రీస్ సినిమా కంటెంట్ ఆల్ రెడీ ప్రూవ్ చేసుకున్న కంటెంట్. ఇక కామెడీ పరంగా సునీల్ అన్న చూసుకుంటాడు. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనడంలో సందేహం లేదు అన్నారు.
సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. గోపీ సుంద్ మ్యూజిక్ బావుంది. ఎన్.శంకర్‌గారికి, సునీల్‌గారికి ఆల్ ది బెస్ట్ అన్నారు.
ఈ చిత్ర డైరెక్టర్ ఎన్.శంకర్ మాట్లాడుతూ... పవర్‌కి, నేచుర్‌కి చాలా దగ్గర సంబంధం ఉంది. మా సినిమా టీజర్‌ను పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ విడుదల చేశారు. ఆ టీజర్‌ను ఇప్పటి వరకు 40 లక్షల మంది చూశారు. అలాగే సినిమా పాటలను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. కాబట్టి సినిమా అందరికీ నచ్చుతుంది. ముందు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకోగానే..సునీల్ అయితేనే చేయాలని ముందుగా అనుకున్నాను. ఆ రైట్స్ కొనాలని అనుకుంటున్న తరుణంలో బండ్ల గణేష్ రైట్స్‌ను దక్కించుకున్నాడు. సరేనని కామ్‌గా అయిపోయాను. ఈ సినిమాను తెలుగులో నేనే చేయాలని రాసి ఉందేమో..అటు, ఇటు తిరిగి నా దగ్గరకే వచ్చింది. చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా కదా! అని ఆలోచించి సినిమా చేశాను. గోపీ సుందర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.
రీ రికార్డింగ్ ముగియగానే మలయాళం కంటే తెలుగులో సినిమా అద్భుతంగా వచ్చిందని తనే నా దగ్గర అన్నాడు. ఇక సునీల్ విషయానికి వస్తే, తనొక ట్రాన్స్‌ఫర్మర్. తను ఓన్ చేసుకుని నటించాడు. రేపు సినిమా చూసిన వారందరికీ సునీల్ తప్పకుండా గుర్తుంటాడు. శంకర్‌కి, సునీల్‌కు ఈ సినిమా గ్రేట్ జర్నీ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. హార్ట్ టచింగ్‌తో పాటు హ్యూమన్ వాల్యూస్ ఉన్న చిత్రమిది. చీకటిని చీకటి జయించదు. వెలుగే జయిస్తుంది. అలాగే ద్వేషాన్ని ద్వేషం జయించదు. ప్రేమ మాత్రమే జయిస్తుంది. ఇప్పటి యువత వేగ వంతమైన జీవితంలో పడి చాలా విషయాలను మరచిపోతున్నారు. అందులో నిజమైన ప్రేమ ఒకటి. నిజమైన ప్రేమ గుండెను తాకితే ఎలా ఉంటుందో తెలిపే చిత్రమే ఇది. సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అన్నారు.
సునీల్ మాట్లాడుతూ... నాకు మలయాళ హీరో దిలీప్ సినిమాలు రీమేక్ చేయడానికి చక్కగా సూట్ అవుతాయి. ఆయన చేసిన సినిమానే తెలుగులో పూల రంగడుగా రీమేక్ చేసి సక్సెస్ కొట్టాను. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రం `2 కంట్రీస్`ను తెలుగులో చేయడం ఆనందంగా ఉంది. శంకర్‌గారు పట్టు వదలకుండా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను భారీ రేంజ్‌లో నిర్మించారు. గోపీసుందర్‌గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సినిమా తప్పకుండా అందికీ నచ్చుతుంది`` అన్నారు.
వీర శంకర్ మాట్లాడుతూ... మలయాళంలో 55 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగులో కూడా అంతే కలెక్షన్స్‌ను సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. జెమిని కిరణ్ మాట్లాడుతూ ఎన్.శంకర్ ఎంతో కష్టపడి డైరెక్ట్ చేస్తూనే సినిమాను నిర్మించారు. తనకు, సునీల్‌కి సినిమా పెద్ద హిట్ కావాలి అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ... నేను రాజాది గ్రేట్ సినిమా సమయంలో రెండు, మూడు సీన్స్ చూశాను. సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని తెలుస్తుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో దశరథ్, శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, బి.వి.ఎస్.రవి, వెంకీ కుడుముల, ఇ.సత్తిబాబు, వి.ఎన్.ఆదిత్య, సురేష్ కొండేటి, పృథ్వీ, నందిని సిధా రెడ్డి, భాస్కరభట్ల, శ్రేష్ఠ, దేదీప్య, వైష్ణవి, మేఘాంశ్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందించారు.
సాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, సిజ్జు, దేవ్ గిల్, శివారెడ్డి, ఝాన్సీ, సంజన తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, డైలాగ్స్: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, సంగీతం: గోపీసుందర్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కె.వెంకటరమణ, ప్రొడక్షన్ కంట్రోలర్: కర్రపాటి రమణ, నిర్మాణం-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎన్.శంకర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments