19న 'ఆటోనగర్ సూర్య ఆడియో'...

  • IndiaGlitz, [Thursday,January 16 2014]

నవ యువ సామ్రాట్ నాగచైతన్య, చెన్నై సోయగం సమంత కలిసి నటిస్తున్న సినిమా 'ఆటోనగర్ సూర్య'. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ బ్యానర్ సినిమాని రూపొందిస్తుంది. కె. అచ్చిరెడ్డి నిర్మాత. దేవాకట్టా దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆడియో ఈ నెల 19న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ ''ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో భాగంగా రీరికార్డింగ్ జరుపుకుంటుంది. అనూప్ ఎక్స్ ట్రార్డినరి మ్యూజిక్ ఇచ్చారు. ఈ నెల 19న శిల్పకళా వేదికలో ఆడియో విడుదల చేస్తున్నాం. అలాగే సినిమాని కూడా ఫిభ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు.

కిమాయా, బ్రహ్మానందం, సాయికుమార్, జయప్రకాష్రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, దువ్వాసి మోహన్, అజయ్, వేణుమాధవ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: అనూప్, కెమెరాః శ్రీకాంత్ నారోజ్, నిర్మాతః కె.అచ్చిరెడ్డి, కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.