తెలంగాణలో కొత్తగా 1842 కేసులు..

  • IndiaGlitz, [Monday,August 24 2020]

రెండు రోజులుగా తెలంగాణలో కేసుల సంఖ్య 2 వేల మార్కును దాటివేయగా.. నేడు కాస్త తగ్గింది. అయితే కరోనా కేసులకు సమానంగా రికవరీ కేసులు కూడా ఉండటం గమనార్హం. సోమవారం తెలంగాణ హెల్త్ బులిటె‌న్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 36,282 శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 1842 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఒక లక్షా 6వేల 91కి చేరుకుంది.

కాగా గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కరోనా కారణంగా ఆరుగురు మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 761 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 1825 మంది డిశ్చార్జ్ అయినట్టు వైద్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ మొత్తం 82,411 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,919కు చేరుకుంది.

రాష్ట్రంలోని హోమ్ ఐసోలేషన్‌లో 16,482 మంది ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఎప్పటిలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 373, కరీంనగర్- 134, నిజామాబాద్-158, రంగారెడ్డి-109, సూర్యాపేట-113 కేసులు నమోదయ్యాయ. కాగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 9,68,121 పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

షూటింగ్‌కు సిద్దమవుతున్న ప్రభాస్.. సెప్టెంబర్ రెండో వారంలో స్టార్ట్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో స్టార్ట్ కాబోతోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో

రేపు సీడబ్ల్యూసీ కీలక భేటీ.. సోనియా రాజీనామా?

కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంపై ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా.. 2019లో తిరిగి ఆయన అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు.

అత్త పాత్ర‌లో సిమ్రాన్‌..?

చిరంజీవి, బాల‌య్య‌, వెంక‌టేశ్‌, నాగార్జున, మహేశ్‌, ప్ర‌భాస్‌(ఓ సాంగ్‌లో) వంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో

సినీ, టీవీ షూటింగ్‌లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

అన్‌లాక్ 3.0లో భాగంగా దేశ వ్యాప్తంగా సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగ్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.

కిరాక్ ఆర్.పి ద‌ర్శ‌క‌త్వంలో నూత‌న‌ చిత్రం ప్రారంభం

జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షోతో తెలుగు ప్ర‌జ‌ల‌కి సుప‌రిచిత‌మైన క‌మీడియ‌న్ కిరాక్ ఆర్.పి ద‌ర్శ‌కునిగా మారారు.