తెలంగాణలో కొత్తగా 1842 కేసులు..
Send us your feedback to audioarticles@vaarta.com
రెండు రోజులుగా తెలంగాణలో కేసుల సంఖ్య 2 వేల మార్కును దాటివేయగా.. నేడు కాస్త తగ్గింది. అయితే కరోనా కేసులకు సమానంగా రికవరీ కేసులు కూడా ఉండటం గమనార్హం. సోమవారం తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 36,282 శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 1842 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఒక లక్షా 6వేల 91కి చేరుకుంది.
కాగా గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కరోనా కారణంగా ఆరుగురు మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 761 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 1825 మంది డిశ్చార్జ్ అయినట్టు వైద్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ మొత్తం 82,411 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,919కు చేరుకుంది.
రాష్ట్రంలోని హోమ్ ఐసోలేషన్‌లో 16,482 మంది ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఎప్పటిలాగే జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 373, కరీంనగర్- 134, నిజామాబాద్-158, రంగారెడ్డి-109, సూర్యాపేట-113 కేసులు నమోదయ్యాయ. కాగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 9,68,121 పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Telugu : Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 24.08.2020)#TelanganaFightsCorona #StayHome #StaySafe
— Eatala Rajender (@Eatala_Rajender) August 24, 2020
For complete Bulletin.. please click on below link ??https://t.co/nJ24zLHdOe pic.twitter.com/oB5zTF32WZ
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com