చిరు 'బావగారూ బాగున్నారా'కి 18 ఏళ్లు

  • IndiaGlitz, [Saturday,April 09 2016]

వినోదానికి పెద్ద‌పీట వేస్తూ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రాల్లో 'బావ‌గారూ బాగున్నారా'ది ప్ర‌త్యేక స్థానం. బ్ర‌హ్మానందం కాంబినేష‌న్‌లో ప్ర‌థ‌మార్థంని.. కోట శ్రీ‌నివాస‌రావు, శ్రీ‌హ‌రి కాంబినేష‌న్‌లో ద్వితీయార్థంని ర‌క్తి క‌ట్టిస్తూ చిరు చేసిన కామెడీ.. సినిమా విజ‌యానికి ఎంతో ప్ల‌స్ అయింది. రంభ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై కె.నాగ‌బాబు నిర్మించాడు. ఇదివ‌ర‌కు చిరంజీవి హీరోగా నాగ‌బాబు నిర్మించిన చిత్రాలు ఆశించిన విజ‌యాల‌ను సాధించ‌క‌పోయినా.. ఆ లోటుని భ‌ర్తీ చేసిందీ చిత్ర విజ‌యం.

స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌కి ట‌ర్నింగ్ పాయింట్‌గా నిలిచిన ఈ సినిమాలోని పాట‌ల‌న్నీ ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా 'ఆంటీ కూతురా అమ్మో అప్స‌రా', 'సారీ సారీ' పాట‌లు ఇప్ప‌టికీ ఎక్క‌డో చోట వినిపి స్తుంటాయి. చిరు, మ‌ణి కాంబినేష‌న్‌లో మ‌రో ప‌ది మ్యూజిక‌ల్ హిట్స్ రావ‌డానికి పునాదిగా నిలిచిందీ చిత్రం. జ‌యంత్ సి.ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'బావ‌గారూ బాగున్నారా'.. 1998లో ఏప్రిల్ 9న విడుద‌లైంది. అంటే.. నేటితో ఈ సినిమా రిలీజై 18 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంద‌న్న‌మాట‌.

More News

'సింహా' నుంచి బోయపాటి అంతే

మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో బోయపాటి శ్రీను శైలే వేరు. తన తొలి చిత్రం భద్ర నుంచి ఆయనది ఇదే తీరు. ఇదిలా ఉంటే.. భద్ర నుంచి ఆయన కి సినిమాల విడుదల పరంగా ఓ సెంటిమెంట్ ఉంది.

నాగచైతన్య హీరోయిన్ టైమ్ బావుంది

ప్రస్తుతం నాగచైతన్య కథానాయకుడుగా నటిస్తున్న చిత్రాలలో 'ప్రేమమ్' ఒకటి. మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన 'ప్రేమమ్' చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది.

యు.ఎస్ లో రికార్డ్ క్రియేట్ చేస్తున్న ఊపిరి

నాగార్జున - కార్తీ - తమన్నా కాంబినేషన్లో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ఊపిరి. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, తమిళ్లో నిర్మించింది. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఊపిరి చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

డబ్భైశాతం షూటింగ్ పూర్తి చేసుకున్న తిక్క

సాయిధరమ్ తేజ్,లారిస్సా బొనేసి జంటగా సునీల్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం తిక్క.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్ పై డా.సి.రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు.

14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లి బ్యానర్ పై రామ్ , సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్ లో కొత్త చిత్రం ప్రారంభం

నమో వెంకటేశ’,‘దూకుడు’,‘1 నేనొక్కడినే’,‘లెజెండ్’,‘పవర్’(కన్నడం),‘ఆగడు’,‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.8,