ఒక్క సిగిరెట్ కారణంగా 18 మందికి కరోనా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక మహిళ అష్టాచెమ్మా ఆడి పదుల సంఖ్యలో కరోనా అంటించిన విషయం ఇప్పటికీ తెలంగాణ వాసులు మరువలేరు. సెకండ్ వేవ్‌లో కూడా ఒక్క సిగరెట్ కారణంగా 18 మంది కరోనా బారిన పడ్డారు. అయితే మొత్తంగా ఎంతమంది కరోనా బారిన పడ్డారనేది తేలడం లేదు. ఓ మార్కెటింగ్ మేనేజర్ నిర్వాకం వల్ల ఇదంతా జరిగింది. అయితే ఇలా కరోనా బారిన పడిన 18 మంది ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండగా.. వారి ద్వారా ఇంకెంత మందికి వైరస్ సోకిందనేది తెలియడం లేదు. అయితే సదరు బాధితులంతా తమకు మార్కెటింగ్ మేనేజర్ కారణంగానే కరోనా సోకిందని మూకుమ్మడిగా తమ బాస్‌కు వెల్లడించారు. ఈ ఘటన ఎక్కడో కాదు.. హైదరాబాద్‌లోనే జరిగింది.
శ్రీనగర్ కాలనీలో నివాసముండే ఓ మార్కెటింగ్ మేనేజర్ ఇటీవల ఆఫీసు పని మీద బయటకు వెళ్లాడు. అయితే కేబీఆర్ పార్కు వద్ద ఓ వ్యక్తి సిగరెట్ కాలుస్తుండటాన్ని గమనించాడు. వెంటనే అక్కడ ఆగి.. తన సిగరెట్ అంటించుకునేందుకు సదరు వ్యక్తి వద్ద నుంచి సిగరెట్ తీసుకున్నాడు. దాంతో తన సిగరెట్ వెలిగించుకున్నాడు. సిగరెట్ తాగిన తర్వాత వెళ్లి తన పనిని ముగించుకున్నాడు. మూడు రోజుల తర్వాత జ్వరం ప్రారంభమైంది. అంతలోనే ఒంటి నొప్పులు ప్రారంభమై అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితికి చేరుకున్నాడు. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందికరంగా మారడంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లి సిటీ స్కాన్ చేయించుకున్నాడు. సదరు మార్కెటింగ్ మేనేజర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
30 శాతం లంగ్స్ దెబ్బతిన్నాయని వైద్యులు సదరు మార్కెటింగ్ మేనేజర్‌కు చెప్పారు. వెంటనే తన పరిస్థితిని తన టీం సభ్యులకు వివరించాడు. వెంటనే వారంతా కోవిడ్ టెస్ట్ చేయించుకోగా.. 20 మందిలో 18 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ 18 మంది వల్ల ఇంకెంత మందికి కరోనా వచ్చిందనే విషయం ఇంకా తేలలేదు. అయితే టీం సభ్యులంతా సదరు మేనేజర్ వల్లే తమకు పాజిటివ్ వచ్చిందని కంపెనీ హెచ్‌ఆర్ ఎదుట బాహటంగానే చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన తనకు ఎక్కడ కరోనా సోకిందా..? అన్న విషయం తెలుసుకునేందుకు వారం రోజుల క్రితం నుంచి తాను కలిసిన వ్యక్తులను ఆరా తీశారు. చివరకు తాను సిగరెట్ అంటించేందుకు ఓ వ్యక్తి తాగుతున్న సిగరెట్ తీసుకోవడమే కారణంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి తాను సిగరెట్‌తో కరోనా అంటించుకోవడమే కాకుండా పలువురికి అంటించాడని టీం సభ్యులు భావిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments