తెలంగాణలో నేడు కొత్తగా 1764 కేసులు నమోదు..

  • IndiaGlitz, [Wednesday,July 29 2020]

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్‌ను బుధవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. నేడు తెలంగాణలో 18,858 శాంపిళ్లను పరీక్షించగా.. 1764 కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 58,906కు చేరుకుంది. నేడు ఒక్కరోజే కరోనాతో 12 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తం మృతుల సంఖ్య 492కు చేరుకుంది. నేడు ఒక్కరోజే కరోనా నుంచి కోలుకుని 842 మంది డిశ్చార్జ్ అవగా.. మొత్తంగా 43,751 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,663 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,97,939 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్‌2....అధీరాగా బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ లుక్ విడుద‌ల‌

ఈ మ‌ధ్య కాలంలో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేపిన అంశం.. అధీరా లుక్‌. ఇంత‌కూ అధీర ఎవ‌రు? క‌్రూర‌మైన వ్య‌క్తి.

దేశ వ్యాప్తంగా ఆగస్ట్‌లో తెరుచుకోనున్న థియేటర్లు!

లాక్‌డౌన్ సమయంలో మూతపడ్డ సినిమా హాళ్లు ఇప్పటికీ ఓపెన్ కాలేదు. అయితే ఇప్పుడిప్పుడే పలు దేశాల్లో కొన్ని జాగ్రత్తల నడుమ హాళ్లు తెరుచుకుంటున్నాయి.

జీవితాన్నే కథగా చెబుతున్న ‘జోహార్’

గుండమ్మ కథలోని పాట రేడియో వినిపిస్తుంటుంది. ఓ తాత‌య్య‌ను పిల్ల‌లు క‌థ చెప్ప‌మ‌ని అడుగుతారు.

అప్పుడు 16-17 గంటలు రోడ్లపైనే గడిపాను: సోనూసూద్

లాక్‌డౌన్ అనగానే ఎవరికి వాళ్లు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవ్వరూ కూడా బయటకు రాలేదు. ఆ సమయంలో వలస కార్మికుల తిప్పలు వర్ణనాతీతం.

రావి కొండలరావు గారి బహుముఖ సేవలు అజరామరం: పవన్

ప్రముఖ నటుడు, రచయిత రావి కొండలరావు మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.