రాజమండ్రిలోని ఓ కాలేజ్‌లో 175 మంది విద్యార్థులకు కరోనా
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో ఏపీ కాస్త సేఫ్ జోన్లో ఉందిలే అనుకుంటే ఇప్పుడు అక్కడ కూడా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా కాలేజీల్లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. రాజమండ్రిలోని ఓ కాలేజీలో కరోనా కల్లోలం రేపింది. తిరుమల ప్రైవేట్ జూనియర్ కాలేజ్‌కు చెందిన హాస్టల్లోని 175 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కాలేజ్ హాస్టల్‌కు ప్రభుత్వ వైద్యులు చేరుకుని వైద్య సేవలు అందిస్తున్నారు. అక్కడి వైద్య సేవలను మంత్రి చెల్లుబోయిన వేణు పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జాగ్రత్తలు పాటించకపోతే మరోసారి లాక్డౌన్ ఎదుర్కోవలసి ఉంటుందని వేణు తెలిపారు. ఇప్పటికే తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీల్లో తెలంగాణ విజృంభిస్తుంటే ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు సహా అన్ని విద్యాసంస్థలను మూసేసింది. మరి తాజాగా ఏపీలో కూడా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com