అయోధ్యలో కరోనా కలకలం.. పూజారి సహా 17 మందికి కరోనా..
Send us your feedback to audioarticles@vaarta.com
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు చూస్తున్న పూజారి సహా అక్కడ భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు మొత్తంగా 17 మందికి కరోనా సోకింది. అయోధ్య నిర్మాణానికి ఆగస్ట్ 5న శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా కలకలం రేగడం ఆందోళనకు దారి తీస్తోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్న ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా దీనికి సంబంధించిన ఏర్పాట్లను చూస్తున్న ప్రదీప్ దాస్ అనే అర్చకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ప్రదీప్ దాస్‌తో పాటు ప్రస్తుతం రామ జన్మభూమి వద్ద భద్రతా విధుల్లో ఉన్న 16 మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారంతా క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. 5న జరగబోయే శంకుస్థాపన వేడకకు మోదీ, బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా 50 మంది ప్రముఖులు హాజరుకానున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout