17 నుంచి ఎన్టీఆర్ కొత్త షెడ్యూల్
Send us your feedback to audioarticles@vaarta.com
రామయ్యా వస్తావయ్యా సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త చిత్రం శరవేగంగా షూటింగ్ని జరుపుకుంటోంది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడు.
ఇదిలా ఉంటే. ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ ఈ నెల 17 నుంచి హైదరాబాద్లో జరగనుందన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో తొలిసారిగా. ఎన్టీఆర్ ప్లేబోయ్ తరహా పాత్రలో నటించనున్నారని వినికిడి. సమంతతో పాటు మరో హీరోయిన్ కి స్థానమున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments