తెలంగాణలో తాజాగా 1640 కేసులు..

  • IndiaGlitz, [Saturday,July 25 2020]

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసింది. తాజాగా తెలంగాణలో 15,445 శాంపిళ్లను పరీక్షించగా.. 1640 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 52,466 కేసులు నమోదయ్యాయి. కాగా.. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి కోలుకుని 1007 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 40,334కు చేరుకుంది. నిన్న తెలంగాణలో కరోనా కారణంగా 8 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 455కు చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 11,677 యాక్టివ్ కేసులున్నాయి.

More News

కాపు రిజర్వేషన్లపై స్పందించిన పవన్.. కేసీఆర్‌కు సూచన

కాపు కార్పొరేషన్‌కు విడుదల చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి కోరారు.

అది వైసీపీకి దేవుడిచ్చిన వరం.. నేతలు కళ్లు తెరవాలి: పవన్

ఏపీ ప్రభుత్వ పని తీరుతో పాటు పలు విషయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు.. రాష్ట్రంలోనే తొలిసారిగా..

ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి.

అదే జరిగితే.. రాష్ట్రం రావణకాష్టం అవుతుంది: పవన్

ప్రజలు ఎదురు తిరగట్లేదు.. ఏమీ మాట్లాడట్లేదు అనుకోవడం పొరపాటేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

రానా వెడ్డింగ్ ఇన్విటేష‌న్‌(ఫ్యాన్ మేడ్)... వేదిక మార‌నుందా?

సినీ ప‌రిశ్ర‌మ‌లో ద‌గ్గుబాటి వారికి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. వీరి మూడోత‌రంగా సినీ రంగంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నాడు రానా ద‌గ్గుబాటి.