16న బన్నీ అండ్ చెర్రీ' ఆడియో
Send us your feedback to audioarticles@vaarta.com
రాజేష్ పులి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ 'బన్నీ అండ్ చెర్రీ'. ప్రిన్స్, మహత్ , కృతి, సబా హీరోహీరోయిన్లు. యండమూరి వీరేంద్రనాథ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. హరున్ గని ఆర్ట్స్ బ్యానర్లో హరున్ గని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మల్టీమీడియా విజన్ సమర్పణ.
ఈ సినిమా ఆడియోను ఈ నెల 16న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ' ప్రిన్స్, మహత్ ఇందులో అద్భుతంగా నటించారు. రాజేష్ సినిమా చక్కగా తెరకెక్కించారు. ఈ నెల 16న ఆడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.
ఈ చిత్రంలో బ్రహ్మానందం, సుమన్, పోసాని, ఎల్బీ శ్రీరామ్, చంద్రమోహన్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి కెమెరాః వి.రవికుమార్; నిర్మాతః హరున్ గని, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం:రాజేష్ పులి.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments