స్టూడెంట్ నెం.1కి 16 ఏళ్లు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్లో నెం.1 డైరెక్టర్ ఎవరంటే.. ఎవరైనా తడుముకోకుండా చెప్పే పేరు ఎస్.ఎస్.రాజమౌళి అనే. అపజయమంటూ ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఈ దర్శకమౌళి దర్శకప్రస్థానం మొదలైంది 2001లో వచ్చిన స్టూడెంట్. నెం 1 సినిమాతోనే. అప్పుడప్పుడే కథానాయకుడిగా అడుగులు వేస్తున్న జూనియర్ ఎన్టీఆర్‌కి ఈ సినిమా తొలి విజయాన్నిచ్చింది. అతనిలో ఓ మంచి నటుడు, డ్యాన్సర్ ఉన్నాడనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది ఈ సినిమాతోనే.
ఆల్మోస్ట్ ఫేడవుట్ అయిపోతున్నాడు అనుకున్న టైంలో కీరవాణికి ఈ సినిమా మళ్లీ ఊపు తెచ్చింది. అంతేకాకుండా.. అంతకుముందు చాలా పాటలు పాడినప్పటికీ.. ఉత్తమ గాయకుడుగా తొలి నంది పురస్కారాన్నిచ్చింది కూడా ఈ సినిమానే. ఆ పాటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి. ఈ పాట అనే కాదు.. స్టూడెంట్ నెం.1లో పాటలన్నీ సూపర్‌గా ఉంటాయి. వందచిత్రాల మైలురాయికి చేరువవుతున్న సమయంలో కె.రాఘవేంద్రరావు ఈ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. గజాలా కథానాయికగా నటించిన ఈ సినిమా 2001లో సెప్టెంబర్ 27న విడుదలైంది. అంటే.. నేటితో ఈ సినిమా 16 ఏళ్లను పూర్తి చేసుకుంటోందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com