టాప్ డైరక్టర్స్ ను ఆకట్టుకున్న '16'
- IndiaGlitz, [Tuesday,March 21 2017]
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో రెహమాన్, ప్రకాష్ విజయ్ రాఘవన్, అశ్విన్ కుమార్ తదితరులు తారాగణంగా కార్తీక్ నరేన్ దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మాతగా రూపొందిన చిత్రం '16'. ఈ సినిమా మార్చి 10న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, రాజ్‌కందుకూరి, లక్ష్మణ్, వినోద్, కార్తీక్ నరేన్, కె.ఎస్.నాగేశ్వరరావు, కిషోర్ రెడ్డి, అంజి శ్రీను, డార్లింగ్ స్వామి, టి.ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
రాజ్‌కందుకూరి మాట్లాడుతూ - ''ఇటువంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా '16'ను తెలుగులో విడుదల చేసిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుగారికి థాంక్స్. దర్శకుడు కార్తీక్ నరేన్ ఇంత కాంప్లికేటెడ్ సినిమాను ఎంతో చక్కగా తెరకెక్కించాడు. ఎంటైర్ టీంకు అభినందనలు'' అన్నారు.
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ - ''సినిమాను విడుదల చేయాలంటే ఎక్కవ థియేటర్స్ దొరకలేదు. అయినా కాన్సెప్ట్‌పై ఉన్న నమ్మకంతో ఒక థియేటర్లోనే సినిమాను విడుదల చేశాను. అయితే సినిమా అద్భుతంగా రన్ అవుతూ హౌస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. సినిమా ఇప్పటికీ రెండు కోట్లు కలెక్ట్ చేసింది. ఇంత పెద్ద సక్సెస్ కావడంలో డైరెక్టర్‌కే ఎక్కువ క్రెడిట్ దక్కుతుంది'' అన్నారు.
లక్ష్మణ్ మాట్లాడుతూ - ''కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనడానికి నిదర్శనమే బిచ్చగాడు సక్సెస్‌కు కారణం. ఇప్పుడు '16' సినిమా సక్సెస్ ఆ విషయాన్ని మరోసారి నిరూపించింది. దర్శకుడు కార్తీక్ నరేన్ చాలా మంది దర్శకులకు ఇన్స్పిరేషన్గా నిలిచాడు. తెలుగులో డైరెక్ట్ సినిమా చేయాలనుకుంటే దర్శకులు కథ చెప్పి 10-15 కోట్ల బడ్జెట్ అవుతుందంటున్నారు. కాన్సెప్ట్ కరెక్ట్‌గా ఉండి, స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఖర్చు పెట్టవచ్చు కానీ లేకుంటే ఖర్చు పెట్టడం వృథా అవుతుంది. అందుకే కొత్త దర్శకులు కోటి నుండి రెండు కోట్ల రూపాయల బడ్జెట్‌తో మంచి కాన్సెప్ట్ సినిమాలను నిర్మించండి తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు'' అన్నారు.
దర్శకుడు కార్తీక్ నరేన్ మాట్లాడుతూ - ''తమిళంలో తక్కువ పెట్టుబడితో చిన్న చిన్న నటీనటులు, కొత్త టెక్నిషియన్స్‌తో సినిమా చేశాను. తమిళంలో కూడా సినిమా నెమ్మదిగానే సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను లక్ష్మణ్‌గారు తెలుగులో విడుదల చేశారు. తెలుగులో కూడా సినిమాపెద్ద హిట్ కావడం ఆనందంగా ఉంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఇదే బ్యానర్లో తెలుగులో ఓ సినిమా చేస్తాను'' అన్నారు.