కుప్పకూలిన విమానం.. 157 మంది దుర్మరణం..!?
Send us your feedback to audioarticles@vaarta.com
థియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 విమానం(ET 302) ఒకటి కుప్పకూలింది. అదిస్ అబాబా నుంచి నైరోబీకి వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని ఆసంస్థ అధికార ప్రతినిధి రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపారు. కాగా ఆ విమానంలో మొత్తం 157 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 149 మంది ప్రయాణికులు కాగా.. ఎనిమిది మంది విమాన సిబ్బంది ఉన్నట్టు సమాచారం. అయితే విమానం ఎక్కడ కూలింది? ఎంతమంది తుదిశ్వాస విడిచారు..? వారంతా ఎక్కడి వాళ్లు..? అనే విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది. కాగా విమానం కదిలిన ఆరు నిమిషాలకే ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.
కలకలం రేపుతున్న ట్వీట్..
ఇదిలా ఉంటే.. విమానం కూలిన ఘటనపై ఇథియోపియా ప్రధాని కార్యాలయం సంతాపం ప్రకటించడంతో విమానంలోని అందరూ చనిపోయరనే దానిపై అనుమానాలు పెరుగుతున్నాయి. ట్వీట్లో ఏముందంటే.. ‘ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం కూలిపోయింది. ప్రమాదంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం.’ అని ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. మొత్తానికి చూస్తే.. ప్రాణనష్టం భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆ విమానంలో వెళ్లిన వారి కుటుంబీకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
The Office of the PM, on behalf of the Government and people of Ethiopia, would like to express it’s deepest condolences to the families of those that have lost their loved ones on Ethiopian Airlines Boeing 737 on regular scheduled flight to Nairobi, Kenya this morning.
— Office of the Prime Minister - Ethiopia (@PMEthiopia) March 10, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments