కుప్పకూలిన విమానం.. 157 మంది దుర్మరణం..!?

  • IndiaGlitz, [Sunday,March 10 2019]

థియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 విమానం(ET 302) ఒకటి కుప్పకూలింది. అదిస్ అబాబా నుంచి నైరోబీకి వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని ఆసంస్థ అధికార ప్రతినిధి రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపారు. కాగా ఆ విమానంలో మొత్తం 157 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 149 మంది ప్రయాణికులు కాగా.. ఎనిమిది మంది విమాన సిబ్బంది ఉన్నట్టు సమాచారం. అయితే విమానం ఎక్కడ కూలింది? ఎంతమంది తుదిశ్వాస విడిచారు..? వారంతా ఎక్కడి వాళ్లు..? అనే విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది. కాగా విమానం కదిలిన ఆరు నిమిషాలకే ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.

కలకలం రేపుతున్న ట్వీట్..

ఇదిలా ఉంటే.. విమానం కూలిన ఘటనపై ఇథియోపియా ప్రధాని కార్యాలయం సంతాపం ప్రకటించడంతో విమానంలోని అందరూ చనిపోయరనే దానిపై అనుమానాలు పెరుగుతున్నాయి. ట్వీట్‌లో ఏముందంటే.. ‘ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం కూలిపోయింది. ప్రమాదంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం.’ అని ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. మొత్తానికి చూస్తే.. ప్రాణ‌న‌ష్టం భారీగా ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. దీంతో ఆ విమానంలో వెళ్లిన వారి కుటుంబీకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More News

వైసీపీ ఎఫెక్ట్.. ఆ పార్టీ గుర్తు పక్కనెట్టిన ఎన్నికల కమిషన్!

ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ప్రజాశాంతి పార్టీ కూడా తలపడుతున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్‌‌లో ట్రెండ్ సెట్ చేస్తున్న ‘96’ బ్యాక్‌డ్రాప్!

ప్రేమ తాలూకు జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తూ హృద్యమైన ఇతివృత్తంతో రూపొందిన తమిళ చిత్రం ‘96’ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

నీరవ్ మోదీ నోట.. నో కామెంట్.. 8 లక్షల జాకెట్!

పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన వేల కోట్లరూపాయిల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వ్యాపారవేత్త నీరవ్ మోదీ ఇండియా వదిలి పారిపోయిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్‌కు టాటా చెప్పి కారెక్కనున్న సబితా.. ఎంపీ టికెట్ ఫిక్స్!

తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగలడంతో.. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించాలని అధిష్టానం సమాయత్తమవుతోంది.

కాంగ్రెస్‌ అధిష్టానంపై రేవంత్ గుర్రు!

తెలంగాణలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు శంషాబాద్ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శంఖారావం పూరించిన సంగతి తెలిసిందే.