15న వస్తున్న జగద్గురు ఆదిశంకర

  • IndiaGlitz, [Friday,August 09 2013]

జె.కె.భారవి తెరకెక్కించిన సినిమా జగద్గురు ఆదిశంకర. కౌషిక్ బాబు కీలక పాత్రధారి. అక్కినేని నాగర్జునా, ఉపేంద్ర, మోహన్ బాబు, సాయికుమార్, శ్రీహరి, కైకాల సత్యనారాయణ, మైనంపాటి శ్రీరామచంద్ర, మీనా, కమలిని ముఖర్జీ, రోహిణి, రోజా, పోసాని క్రిష్ణమురళి, తనికెళ్ళ భరణి కీలక పాత్రధారులు. ఈ సినిమాను నారా జయశ్రీదేవి నిర్మిస్తున్నారు. నాగ్ శ్రీవాస్తవ్ అందించిన సంగీతానికి మంచి స్పందన వస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎవడు, అత్తారింటికి దారేది చిత్రాలు వాయిదా పడటంతో ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాత నారా జయశ్రీదేవి యత్నిస్తున్నారు.