తెలంగాణలో కొత్తగా 1524 కేసులు నమోదు..

  • IndiaGlitz, [Wednesday,July 15 2020]

తెలంగాణలో మంగళవారం కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. 13,175 శాంపిళ్లను పరిశీలించగా 1524 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,745కు చేరుకుంది. కాగా.. కరోనా కారణంగా 10 మంది చనిపోయారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 375కు చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 12,531 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 24,840 మంది డిశ్చార్జి అయ్యారు.

జిల్లాల వారీగా కేసులను పరిశీలిస్తే.. ఎప్పటిలాగే జీహెచ్ఎంసీ పరిధిలోనే మేజర్‌గా కేసులు నమోదయ్యాయి. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో మంగళవారం 815 కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 240, మేడ్చల్ జిల్లాలో 97, సంగారెడ్డి జిల్లాలో 61, ఖమ్మం జిల్లాలో 8, కామారెడ్డి జిల్లాలో 19, వరంగల్ అర్బన్‌ జిల్లాలో 30, వరంగల్ రూరల్‌ జిల్లాలో 2, నిర్మల్ జిల్లాలో 3, కరీంనగర్ జిల్లాలో 29, జగిత్యాల జిల్లాలో 2, మెదక్ జిల్లాలో 24, మహబూబ్ నగర్ జిల్లాలో 7, మంచిర్యాల జిల్లాలో 12, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8, జయశంకర్ భూపాల్లి జిల్లాలో 12, నల్గొండ జిల్లాలో 38, సిరిసిల్ల జిల్లాలో 19, ఆదిలాబాద్ జిల్లాలో 7, ఆసీఫాబాద్ జిల్లాలో 5, వికారాబాద్ జిల్లాలో 21, నాగర్ కర్నూల్ జిల్లాలో 1, జనగాం జిల్లాలో 4, నిజామాబాద్ జిల్లాలో 17, ములుగు జిల్లాలో 6, వనపర్తి జిల్లాలో 5, సిద్దిపేట జిల్లాలో 4, సూర్యాపేట జిల్లాలో 15, గద్వాల జిల్లాలో 13 కేసులు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

More News

కొరియోగ్రాఫ‌ర్‌గా సాయిప‌ల్ల‌వి

తెలుగులో ఫిదా చిత్రంతో ప్రేక్ష‌కుల హృద‌యాల్ని దోచుకున్న సాయిప‌ల్లవి త‌ర్వాత ఏంసీఏ, క‌ణం త‌దిత‌ర చిత్రాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.

యూత్‌కి షాకిస్తున్న కరోనా తాజా అధ్యయనాలు

కరోనాపై రోజురోజుకూ వెలువడుతున్న అధ్యయనాలు ఒక్కొక్క అపోహనూ కొట్టి పారేస్తున్నాయి. ఇప్పటికే కరోనా మళ్లీ మళ్లీ సోకే అవకాశముందంటూ షాక్ ఇవ్వగా..

అందుకే ‘పుష్ప’ నుంచి తప్పుకున్నా: విజయ్ సేతుపతి

నటనతో అభిమానులను సంపాదించుకునే హీరోలు చాలా తక్కువగా ఉంటారు. వారిలో కోలివుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఒకరు.

తెలంగాణలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ల‌వ్ స్టోరీ.. 'అస‌లేం జ‌రిగింది? 'థియేట‌ర్లా?? లేక ఓటీటీయా??

తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌ల ఆధారంగా రూపొందించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ల‌వ్ స్టోరీ 'అస‌లేం జరిగింది' 

మ‌ణిర‌త్నంతో సూర్య‌!!

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్స్‌లో మ‌ణిర‌త్నం పేరు ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది. ఈ ద‌ర్శ‌క నిర్మాత హీరో సూర్య‌తో గ‌తంలో యువ సినిమాను రూపొందించిన సంగ‌తి తెలిసిందే.