తెలంగాణలో కొత్తగా 1524 కేసులు నమోదు..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో మంగళవారం కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. 13,175 శాంపిళ్లను పరిశీలించగా 1524 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,745కు చేరుకుంది. కాగా.. కరోనా కారణంగా 10 మంది చనిపోయారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 375కు చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 12,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 24,840 మంది డిశ్చార్జి అయ్యారు.
జిల్లాల వారీగా కేసులను పరిశీలిస్తే.. ఎప్పటిలాగే జీహెచ్ఎంసీ పరిధిలోనే మేజర్‌గా కేసులు నమోదయ్యాయి. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో మంగళవారం 815 కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 240, మేడ్చల్ జిల్లాలో 97, సంగారెడ్డి జిల్లాలో 61, ఖమ్మం జిల్లాలో 8, కామారెడ్డి జిల్లాలో 19, వరంగల్ అర్బన్ జిల్లాలో 30, వరంగల్ రూరల్ జిల్లాలో 2, నిర్మల్ జిల్లాలో 3, కరీంనగర్ జిల్లాలో 29, జగిత్యాల జిల్లాలో 2, మెదక్ జిల్లాలో 24, మహబూబ్ నగర్ జిల్లాలో 7, మంచిర్యాల జిల్లాలో 12, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8, జయశంకర్ భూపాల్లి జిల్లాలో 12, నల్గొండ జిల్లాలో 38, సిరిసిల్ల జిల్లాలో 19, ఆదిలాబాద్ జిల్లాలో 7, ఆసీఫాబాద్ జిల్లాలో 5, వికారాబాద్ జిల్లాలో 21, నాగర్ కర్నూల్ జిల్లాలో 1, జనగాం జిల్లాలో 4, నిజామాబాద్ జిల్లాలో 17, ములుగు జిల్లాలో 6, వనపర్తి జిల్లాలో 5, సిద్దిపేట జిల్లాలో 4, సూర్యాపేట జిల్లాలో 15, గద్వాల జిల్లాలో 13 కేసులు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments