స్టూడెంట్ నెం1 కు 15 ఏళ్లు..!
Tuesday, September 27, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - దర్శకధీర రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన చిత్రం స్టూడెంట్ నెం 1. బాహుబలి చిత్రంతో కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన రాజమౌళి ప్రస్ధానం ప్రారంభమైంది ఈ చిత్రం ద్వారానే. రాజమౌళి గురువు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ చిత్రం రూపొందింది. ఎన్టీఆర్ కు తొలి చిత్రం నిన్ను చూడాలని ఆశించిన విజయాన్ని అందించలేకపోయినా...రెండో చిత్రమైన స్టూడెంట్ నెం 1 సూపర్ హిట్ గా నిలిచి ఎన్టీఆర్, రాజమౌళి కెరీర్ లో మరచిపోలేని చిత్రంగా నిలిచింది. స్వరవాణి కీరవాణి సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేకకార్షణగా నిలిచి చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించింది అని చెప్పవచ్చు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్, రాజమౌళిల ఫ్రెండ్ రాజీవ్ కనకాల నటించారు. ఈ సినిమా షూటింగ్ లోనే రాజీవ్ కనకాల రాజమౌళిని జక్కన్న అని పిలవడం...ఎన్టీఆర్ ఆ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియచేయడంతో జక్కన్న పేరు ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. స్టూడెంట్ నెం 1 చిత్రం రిలీజై నేటికి 15 ఏళ్లు అయ్యింది అంటే...దర్శకుడుగా రాజమౌళికి 15 ఏళ్లు. ఈ 15 ఏళ్లలో తను ఎదుగుతూ...తనతో పాటు తెలుగు సినిమాని ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకధీర నీకు అభినందన మందార మాల..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments