'ఖడ్గం'కి 15 ఏళ్లు
Send us your feedback to audioarticles@vaarta.com
దేశభక్తి నేపథ్యంలో రూపొందే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. వాటిలో విజయం సాధించే సినిమాల సంఖ్య కూడా అంతే అరుదుగా ఉంటుంది. అలాంటి విజయవంతమైన చిత్రాల్లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ రూపొందించిన ఖడ్గం ఒకటి.
దేశభక్తితో పాటు సినిమా వాళ్ల నేపథ్యాన్ని కూడా జోడించి తెరకెక్కించిన ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందింది. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, ఉత్తేజ్, బ్రహ్మాజీ, సోనాలి బెంద్రే, సంగీత, కిమ్ శర్మ, పావలా శ్యామల, పృథ్వి ముఖ్య తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఎస్సెట్‌గా నిలిచింది.
ఇందులోని నువ్వు నువ్వు, గోవిందా గోవిందా, అహ అల్లరి అల్లరి చూపులతో, ముసుగు వేయ్యొద్దు, మేమే ఇండియన్స్.. ఇలా ప్రతి పాట హిట్ అయ్యింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయనటుడు (ప్రకాష్ రాజ్), ఉత్తమ కళా దర్శకుడు, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్‌తో పాటు జ్యూరీ అవార్డు (రవితేజ) విభాగాల్లో ఈ సినిమా నంది పురస్కారాలను అందుకుంది.
అలాగే హిందీలోనూ ఈ సినిమా రీమేక్ అయ్యింది. నవంబర్ 29, 2002న విడుదలైన ఖడ్గం.. నేటితో 15 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments