'జయం మనదేరా' కి15 ఏళ్లు
Send us your feedback to audioarticles@vaarta.com
మహదేవనాయుడు, రుద్రమనాయుడు (అభిరామ్).. ఇలా రెండు విభిన్న పాత్రల్లో వెంకటేష్ వెండితెరపై సందడి చేసిన చిత్రం 'జయం మనదేరా'. ఎన్.శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం వెంకటేష్ 2000వ సంవత్సరానికి గానూ 'ఉత్తమ నటుడు'గా 'ఫిల్మ్ ఫేర్' పురస్కారాన్ని పొందారు.
సౌందర్య, భాను ప్రియ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కోసం వందేమాతరం శ్రీనివాస్ అందించిన స్వరాలు ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా 'మెరిసేటి జాబిలి నీవే' పాట అప్పట్లో పెద్ద సంచలనంగా నిలిచింది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమా 2000వ సంవత్సరంలో అక్టోబర్ 7న విడుదలైంది. అంటే..నేటికి 'జయం మనదేరా' విడుదలై 15 ఏళ్లు పూర్తవుతోందన్నమాట
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments