తమిళనాడులో వర్షాలకు ఘోరం.. 15 మంది మృతి
- IndiaGlitz, [Monday,December 02 2019]
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో గత రెండ్రోజులుగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వర్షాల థాటికి కోయంబత్తూరులోని మెట్టుపాళ్యంలో నాలుగు భవనాలు కూప్పకూలాయి. ఈ ఘటనలో 15 మంది అక్కడిక్కడే మృతి చెందారు. కాగా.. ప్రమాద సమయంలో వారంతా నిద్రలో ఉండడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే.. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు సమాచారం. స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 15 మంది చనిపోయారా..? లేకుంటే ఇంకా ఎక్కువ మంది చనిపోయారా..? అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కాగా.. భారీవర్షాల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు తమిళనాడు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. చెన్నై నగరంలోని షోజింగానల్లూర్, పల్లవరం, తంబారం, నన్ మంగళం, సెలియాయూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీగా వరదనీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు వేల ఎకరాల్లో 5వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగి దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.